Face Glow: పార్లర్ లాంటి గ్లో ఇంట్లోనే కావాలా? ఇదొక్కటి రాస్తే చాలు

Published : Jan 02, 2026, 04:44 PM IST

Face Glow: మహిళలు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కొందరు మహిళలు మార్కెట్ నుంచి ఖరీదైన ఉత్పత్తులు కొని వాటిని ముఖానికి రాసేస్తారు. మరి కొందరు వివిధ రకాల ఖరీదైన చికిత్సలు చేయించుకుంటారు. 

PREV
13
Face Glow

ఏదైనా పార్టీకి , ఫంక్షన్ కి వెళ్లాలంటే.. ముఖం మెరుస్తూ కనిపించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దాని కోసం వెంటనే దగ్గరలో ఉన్న పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటారు. కానీ, అదంతా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, వాటిలో కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి... ఫేస్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి, వాటితో పని లేకుండా.. సహజంగా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. దాని కోసం ఇంట్లో ఒకే ఒక్కటి వాడితే చాలు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

23
ముఖ సౌందర్యానికి కొబ్బరి పొడి...

కొబ్బరిని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అంతెందుకు కొబ్బరి పాలను మనం ముఖ సౌందర్యానికి వాడతాం. కానీ, కొబ్బరి పొడితో అందం రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ కొబ్బరి తురుముతో ఒక ప్రత్యేక స్క్రబ్ తయారు చేసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల పార్లర్ లాంటి మెరుపు సాధ్యం అవుతుంది.

స్క్రబ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు –

కొబ్బరి పొడి

పెరుగు

తేనె

పాల మీగడ..

33
స్క్రబ్ ఎలా తయారు చేయాలి

మీరు ఇంట్లోనే ఉండి కొబ్బరి పొడితో స్క్రబ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

దీనిని తయారు చేయడానికి, ముందుగా ఒక పెద్ద శుభ్రమైన గిన్నెలో కొబ్బరి పొడిని తీసుకోండి.

ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి.వాటి రెండింటినీ బాగా కలపండి, ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె, కొద్దిగా పాల మీగడ కలపండి. రెండు, మూడు చుక్కల ఆముదం కూడా కలపొచ్చు.

ఇప్పుడు ఈ స్క్రబ్‌ను మీ ముఖానికి 25 నిమిషాల పాటు అప్లై చేయండి.

కొంత సమయం తర్వాత, మీ ముఖాన్ని మృదువుగా చేతి వేళ్లతో మసాజ్ చేయండి.

ఇది మీ చర్మంపై ఉన్న టానింగ్‌ను తగ్గిస్తుంది. మీ ముఖాన్ని అందంగా చేస్తుంది.

మీరు ఈ స్క్రబ్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

మీరు దీనిని మొదటిసారి ప్రయత్నిస్తుంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఉపయోగించండి.

Read more Photos on
click me!

Recommended Stories