మాస్కులను ఇలా వాడితే ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే!

First Published Jan 15, 2022, 9:51 AM IST


Omicron Variant: కరోనా నుంచి మనల్ని  మనం సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నాయి. 

Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్నో కఠిన నియమాలను అమలు చేస్తున్నాయి. అయినా కరోనా వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. అందులోనూ డేల్టా వేరియంట్ కూడా ప్రజలపై విరుచుపడుతోంది. ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి  అత్యంత వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. 

అందుకే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. అవసరమైతే కానీ బయటకు వెళ్లకండి.. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని హెచ్చరికలు జారీ చేస్తునే ఉన్నాయి. అయితే రెండు మాస్కులు ధరిస్తే ఒమిక్రాన్ (Omicron) నుంచి తప్పించుకోవచ్చని హాంగ్ కాంగ్ Scientists లు వెళ్లడిస్తున్నారు. Two Masks ధరించడం వల్ల 91 శాతం Corona నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు.

ప్రజలు అధికంగా ఉండే మర్కెట్లు, మాల్స్,  రద్దీగా ఉండే ఇతర ప్రదేశాలల్లో, బస్ స్టాప్స్ లల్లో, హాస్పటల్స్ లల్లో తిరిగేటప్పుడు ఖచ్చితంగా రెండు మాస్కులను (Double mask) ధరించి సురక్షితంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్లు, Airport staff, వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు తప్పనిసరిగా రెండు మాస్కులను వాడాలని హెచ్చరిస్తున్నారు. N95 మాస్కులు Corona నుంచి రక్షించడంలో ముందుంటాయని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం వల్ల నోటి నుంచి లేదా ముక్కు నుంచి వైరస్ ప్రవేశించే అవకాశం ఉండదు. అయితే Cloth mask ధరించడం వల్ల 30 నుంచి 60 శాతం మాత్రమే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు వెళ్లడిస్తున్నారు. 

అయితే రెండు మాస్కులను ఎలా పెట్టుకోవాలంటే.. ముందుగా సర్జికల్ మాస్క్ ను ధరించాలి. ఆ తర్వాత దానిపైన Cloth mask ను పెట్టుకోవాలట. సర్జికల్ మాస్క్ పైన క్లాత్ మాస్క్ ఎందుకు ధరించాలంటే.. సర్జికల్ మాస్క్ మూలలు చాలా వదులుగా ఉంటాయి. అలా పెట్టుకోవడం వల్ల వైరస్ మాస్క్ లోపలికి చొరబడే ప్రమాదం ఉంది. అందుకే దానిపై Cloth mask పెట్టుకోవడం వల్ల సర్జికల్ మాస్క్ మూలలు టైట్ గా అవుతాయి. అయితే రెండు కూడా సర్జికల్ మాస్కులనే వాడొచ్చని కదా అని అనుకోవచ్చు. కానీ అలా పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. సర్జికల్ మాస్క్ లు ధరిస్తే ఖచ్చితంగా క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. రెండు మాస్కులు వద్దనుకుంటే N95 మాస్క్ ను ఒక్కటి పెట్టుకున్నా కరోనా నుంచి 100 శాతం తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.

click me!