సెక్స్ వల్ల మొటిమలు అవుతాయా? శృంగారం చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?

First Published Feb 5, 2023, 12:42 PM IST

శృంగారంలో పాల్గొంటే ముఖంపై చర్మంపై మొటిమలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సెక్స్ పట్ల చాలా మంది మదిలో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతుంటాయి. ఈ సాంకేతియ యుగంలో కూడా దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి నామోషీగా ఫీలవుతుంటారు. అంటే ఇది బహిరంగంగా మాట్లాడాల్సిన విషయం కాదని భావిస్తుంటారు. అందుకే దీనిపట్ల చాలా మందిలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. సెక్స్ వల్ల బరువు పెరుగుతారని, మొటిమలు అవుతాయని ఏండ్ల నుంచి నమ్ముతున్నవారు ఇప్పటికీ ఉన్నారు.

నిజానికి శృంగారంలో పాల్గొనడం వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొనడం వల్ల మీ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సెక్స్ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే మొటిమలు వస్తాయా? 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పెద్ద అపోహ. సెక్స్ ఎప్పుడూ మొటిమలను కలిగించదు. కానీ సెక్స్ సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మొటిమలతో పాటుగా చర్మ సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటుగా సెక్స్ సమయంలో చర్మం దెబ్బతినే కొన్ని పనులను చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అంతేకాదు మీ శరీరం నుంచి ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మొటిమలు, మొటిమల సమస్యలు వస్తాయి. కానీ చర్మ సంబంధిత సమస్యలు నేరుగా సెక్స్ కు సంబంధించినవి కావంటున్నారు నిపుణులు. 

కొంతమంది సెక్స్ సమయంలో చర్మానికి సరిపోని మసాజ్ ఆయిల్, కొన్ని రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా మొటిమలు అవుతాయి. ఎందుకంటే మీరు మసాజ్ ఆయిల్‌ని ఉపయోగించినప్పుడు మీ భాగస్వామికి ముఖానికి అంటుకుంటుంది. ఇది వారికి పడకపోతే మొటిమలు అవుతాయి. 

సెక్స్ సమయంలో మీ భాగస్వామి శరీర భాగంతో మీ చర్మాన్ని రుద్దడం వల్ల చర్మానికి చాలా నష్టం జరుగుతుంది. సాన్నిహిత్యం ద్వారా, ప్రేమ, ఆప్యాయతను వ్యక్తపరచడానికి చాలా మంది తరచుగా వారి బుగ్గలు, నుదిటిని వారి భాగస్వామి చేతులు, ఛాతీ, వీపుపై రుద్దుతారు. ఇది మీ చర్మానికి చాలా హానికరం.
 

రతి సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వస్తాయి.

శృంగారం చర్మానికి చేసే మేలు 

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

కొల్లాజెన్ ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మానికి చాలా చాలా ముఖ్యమైంది. అయితే ఇది వయస్సుతో పాటుగా తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనిప్తాయి. అయితే కొంతమందిలో వయస్సుకు ముందే కొల్లాజెన్ స్థాయిలు తగ్గుతాయి. దీనికి కారణం ఒత్తిడి కావొచ్చు. ఒత్తిడి వల్ల మీ శరీరం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కానీ సెక్స్ కార్టిసాల్ హార్మోన్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే సెక్స్ సమయంలో శరీరం హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని వల్ల మీకు తక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాగే చర్మంలో కొల్లాజెన్ పరిమాణం పెరుగుతుంది.
 

నిద్ర నాణ్యతను పెంచుతుంది

మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. తగినంత నిద్ర పోవడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంటుంది. అలాగే ఇది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన సెక్స్ మీ నిద్ర నాణ్యతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. బలమైన రోగనిరోధక శక్తి, ఒత్తిడి లేని మనస్సు, సంతోషకరమైన సంబంధం ఇవన్నీ మీ చర్మానికి సహజంగా మెరుపును తీసుకురావడానికి సహాయపడతాయి.
 

సహజమైన గ్లో ను అందిస్తుంది 

శారీరక కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు శరీరంలో రక్త ప్రవాహం పెరిగినట్టే.. సెక్స్ సమయంలో కూడా రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది మన శరీరంలో తగినంత మొత్తంలో ఆక్సిజన్ ను తీసుకువెళుతుంది. ఆక్సిజన్ చర్మానికి కూడా బాగా చేరుకుంటుంది. దీనివల్ల చర్మం సహజంగా గ్లో గా కనిపిస్తుంది. ఆక్సిజన్ కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీంతో మీరు అందంగా కనిపిస్తారు. 

click me!