ఇంటి లోపలి గోడలకు ఏ రంగు వేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

First Published Jan 25, 2022, 3:28 PM IST

ఇంటికి వేసే రంగులు (Colors) కూడా కుటుంబంలోని వ్యక్తుల మీద ప్రభావాన్ని (Effect) చూపుతాయి. ఒక్కొక్కరికి ఒక్కో రంగు అంటే ఇష్టం ఉంటుంది. వారికి ఇష్టమైన రంగులను ఇంటి లోపలి గోడలకు వేసుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రంగులను ఇంటి లోపలి గోడలకు వేసే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మరి ఇప్పుడు మనం ఇంటి లోపలి గోడలకు వేయాల్సిన రంగులు ఏంటో తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల వేసే రంగులు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని (Negative energy) బయటకు పంపించి పాజిటివ్ ఎనర్జీని (Positive energy) ఆకర్షిస్తాయి. దీంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటారు. కనుక ఇంటి లోపల వేసే రంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
 

ఈ రంగులు ఇంటి లోపల సానుకూలమైన వాతావరణాన్ని కల్పించి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి అన్ని సమస్యలను పరిష్కరించే శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపలి గోడలకు వేయవలసిన రంగులు ఆరోగ్యంతో (Health) పాటు శుభ ఫలితాలను (Good results), ధనప్రాప్తిని అందిస్తాయి
 

ఇంటి లోపలి గోడలకు లైట్ ఎల్లో (Light Yellow) రంగును వేస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి ప్రశాంతంగా (Calm down) ఉంటారు.  అలాగే ఈ రంగును పిల్లలు నిద్రించే బెడ్ రూమ్ లో వేస్తే వారి మనసు ప్రశాంతంగా ఉండడంతోపాటు చదువులో కూడా బాగా రాణిస్తారు. ఈ రంగు ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని, దళ ప్రాప్తిని అందిస్తుంది. 
 

కొత్తగా పెళ్లయిన దంపతులు ఎరుపు (Red) రంగు గదిలో నిద్రిస్తే వారి మధ్య ఎలాంటి అపోహలు ఉండకుండా జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రంగు దంపతుల మధ్య కలహాలను తగ్గించి వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.  అలాగే తెలుపు (White) రంగు గదిలో ఉంటే ఏకాగ్రత, మెమొరీ, మానసిక శక్తి పెరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారు లైట్ గ్రీన్ రంగును పడకగదిలో వేసుకోవడం మంచిది.
 

ఈ రంగు గదిలో ఉంటే త్వరగా సంతానం కలుగుతుంది. గర్భంతో ఉన్న మహిళలు నిద్రించే బెడ్ రూమ్ లో ఈ రంగును వేస్తే గర్భిణీ మహిళ ఆరోగ్యంతోపాటు పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉంటారు. కనుక సంతానాభివృద్ధి (Fertility) కోసం లైట్ గ్రీన్ రంగును బెడ్ రూమ్ లో వేసుకోవడం మంచిది. లావెండర్ (Lavender) రంగును ఇంటి లోపలి గోడలకు వేస్తే జ్ఞాపక శక్తి, మానసిక శక్తి పెరిగి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
 

దీంతో అన్ని సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మ‌ట్టి రంగు గదిలో పడుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉంటారు. ఇంటి లోపల ముఖ్యంగా నలుపు (Black) రంగును వేసుకోరాదు.  వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా ఇంటి లోపల నలుపు రంగును వేస్తే అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

click me!