పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ న్యూట్రియంట్స్ ఉంటాయి. ప్రో బయోటిక్స్ కూడా ఉంటాయి. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంది. పెరుగు విషయానికి వస్తే... లాక్టివ్ యాసిడ్ బ్యాక్టీరియా కారణంగా పాలు.. పెరుగుగా మారతాయి. ఇది మనపు క్రీమీ టెక్చర్ లో ఉంటుంది. ఇది తినడం వల్ల ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్స్ లభిస్తాయి. దీనిలో ఉండే ప్రో బయోటిక్ బ్యాక్టీరియా.. మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవ్వడానికి, గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా బ్లోటింగ్ సమస్య ఉంటే.. అది తొందరగా తగ్గిస్తుంది. ఉదయాన్నే పెరుగు తీసుకోవడం వల్ల మనకు కడుపు మంచిగా నిండిన అనుభూతి కలిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.