పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
దేవర మూవీకి ప్రధాన ఆయువు పట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటున్నారు. తండ్రి ఎన్టీఆర్ పాత్ర చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడట దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ పేరు వింటేనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా ఈ రోల్ ఉంటుందని సమాచారం. యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ రేపేవిగా ఉంటాయట.
శంకర్ సినిమాలకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రాణం అని చెప్పాలి. జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు చిత్రాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. గేమ్ ఛేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ప్రజలకు మంచి చేయాలని రాజకీయ పార్టీ స్థాపించిన నీతిగల నాయకుడు పాత్రలో రామ్ చరణ్ ఎపిసోడ్స్ అలరిస్తాయట.