మలబద్ధకానికి అసలు కారణాలు ఇవే..!

First Published | Dec 16, 2023, 7:15 AM IST

చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో మలబద్దకం ఒకటి. చలికాలంలో చాలా మంది ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అసలు ఈ సమస్య రావడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చలికాలంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు వాతావరణంలోని మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి కూడా బలహీనపడి ఎన్నో సీజనల్ వ్యాధుల బారిన పడతాం. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయి. చలికాలం ఆహ్లాదకరంగా అనిపించినా.. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలలో ఒకటి మలబద్దకం. చలికాలంలో చాలా మంది ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. 

అనారోగ్యకరమైన ఆహారాలు, మారుతున్న జీవనశైలి మన ఆరోగ్యంపై ఎంతో  ప్రభావాన్ని చూతాయి. వీటివల్ల మలబద్ధకం కూడా వస్తుంది. కానీ ఇది ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


త్వరగా తినడం

త్వర త్వరగా తినే అలవాటు చాలా మందికే ఉంటుంది. ఇలా త్వరగా తినడం వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలరు. అంటే అలాగే మింగేస్తారన్న మాట. ఇది ఉబ్బరం, వాయువును కలిగిస్తుంది. అంతేకాదు మలబద్దకానికి కూడా కారణమవుతుంది. 
 

constipation

ప్రాసెస్ చేసిన ఆహారం 

ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ ఆహారాలకు బాగా అలవాటు పడ్డారు. కానీ ఈ ఆహారాలలోని అనారోగ్యకరమైన కొవ్వు, అదనపు చక్కెర, జీర్ణక్రియను పాడు చేస్తాయి. మలబద్దకం సమస్యను కలిగిస్తాయి.

అల్పాహారం స్కిప్ చేయడం

బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసేస్తుంటారు. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. అలాగే మలబద్ధకం సమస్య వస్తుంది. 
 

constipation

ఆల్కహాల్ 

ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. అందుకే దీనికి దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు. మీరు కూడా మందుకు బానిసైతే మీ కడుపు పొరకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
 

constipation

నిర్జలీకరణం

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీరు తగినంత మొత్తంలో ఉండాలి. కానీ చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు. దీనివల్ల జనాలు నీటిని ఎక్కువగా తాగరు. దీనివల్ల మీ శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. అలాగే మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. 

click me!