రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు ఏడాదికి ఎన్నిసార్లు ఉతుకుతారో తెలుసా?

First Published | Nov 28, 2024, 9:41 PM IST

 మీరు రైళ్లలో ప్రయాణిస్తుంటారా? అయితే ప్రయాణంలో రైల్వే శాఖ అందించే దుప్పట్లు వాడే వుంటారు. మరి ఆ దుప్పట్లు ఎంత శుభ్రమో తెలుసుకొండి. 

ప్రస్తుతం చలి వణికిస్తోంది. ఈ చలిలో ప్రయాణమంటే చుక్కలు కనిపిస్తాయి. ఈ చలినుండి రక్షణ పొందాలంటే ప్రయాణాల్లోనూ వెచ్చటి దుప్పటి అవసరం. అయితే రైలు ప్రయాణంలో ఈ అవసరం వుండదు... రైల్వే సిబ్బంది మనకు దుప్పట్లు అందిస్తుంటారు. ఇలా అందించే దుప్పట్ల శుభ్రతపై మీకు అనుమానం రావచ్చు. వీటిని నెలకోసారి మాత్రమే ఉతుకుతారని స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇందోరా అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి ఈ సమాధానం ఆయన సమాధానమిచ్చారు.

"భారతీయ రైల్వేలలో ఉపయోగించే దుప్పట్లు చాలా తేలికైనవి, ఉతకడానికి సులభమైనవి. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కోసం రైల్వే శాఖ ప్రయాణీకులకు ఈ దుప్పట్లను సమకూరుస్తోంది" అని మంత్రి పేర్కొన్నారు.

 


భారతీయ రైల్వేలు

పర్యావరణ అనుకూల వస్తువులనే రైళ్లలో ఉపయోగిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ఉపయోగించే వస్తువుల లోడింగ్, దించడం, నిల్వ చేయడం కోసం మెరుగైన లాజిస్టిక్స్‌ను ఉపయోగిస్తున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Latest Videos

click me!