సీతాఫలం తింటున్నారా.. అది తినడం వల్ల కలిగే నష్టాలు, లాభాలు ఏంటో తెలుసుకోండి!

First Published Nov 13, 2021, 4:59 PM IST

సీతాఫలం (Custard apple) అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది లేతాకుపచ్చ రంగు తొక్కలతో తెల్లని గుజ్జుతో నల్లని గింజలతో ఉన్న రూపమే గుర్తొస్తుంది. సీతాఫలంలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఎ, బి, కె క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ రక్తంలో హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతాన్ని పెంచుతాయి. అయితే శీతాకాలంలో దొరికే సీతాఫలాన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

సీతాఫలంలో ఉండే అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీతాఫలంలో పుష్కలంగా ఉండే పోషకాలు విటమిన్లు శరీర కణజాల పునరుద్ధరణకు తోడ్పడతాయి.
 

సీతాఫలాన్ని తీసుకుంటే చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో ఎక్కువగా ఉండే కాపర్, పీచుపదార్థాలు మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగుపరిచేందుకు రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి.
 

సీతాఫలంలో ఎసిటోజెనిన్,  కెటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లు ఆల్కలాయిడ్ లు శరీరంలో క్యాన్సర్ కణాలు (Cancer cells) పెరగకుండా చేస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అరటిపండులో కన్నా సీతాఫలంలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది.
 

ఇది గుండె ఆరోగ్యానికి, బిపి తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని మెగ్నీషియం మూలాలను తొలగించి కండరాల సాగులోకి తోడ్పడతాయి. దాంతో మనకు కీళ్లనొప్పుల (Arthritis) నుంచి విముక్తి కలిగిస్తాయి. సీతాఫలాన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు. మనలో ఉన్న డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
 

ఇందులో గర్భిణీలకు అవసరమయ్యే పోలేట్ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అడ్డుకునేందుకు బి3 విటమిన్ అవసరం. సీతాఫలాన్ని తీసుకుంటే బి3 విటమిన్ లోపం లేకుండా చేస్తుంది. ఇది శరీర రక్త ప్రసరణను పెంచి గుండె జబ్బుల్ని (Heart disease) తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ వంటి మూలకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
 

 సీతాఫలం అల్సర్లను (Ulcers) నయం చేయడంలో అసిడిటీ నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకుంటే కంటిచూపు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్త హీనతను తగ్గిస్తాయి.
 

ఆయుర్వేదంలో సీతాఫలం కాయతోపాటు ఆకుల్ని బెరడును వాడుతుంటారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు (Arthritis), విరోచనాలు (Diarrhea), అజీర్తికీ ఈ చెట్టు ఆకులు బెరడుని మరిగించి మందుగా ఇస్తారు. వేసవిలో వచ్చే సెగ్గడ్డలకి సీతాఫలం ఆకులను ముద్దగా నూరి కట్టుకడితే త్వరగా తగ్గిపోతుందట.
 

 పచ్చికాయలలో పోషకాలు ఎక్కువ అని వాటిని కొన్ని ప్రాంతాల్లో కాల్చుకొని తింటుంటారు. సీజన్లలో దొరికే ఈ సీతాఫలాన్ని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహం ఉన్నవారు దీని తగు మోతాదులో తింటే మంచిది.

click me!