కోవిడ్ 19 : ఈ మొక్కలతో ఇంటికి అందం, ఒంటికి ఆక్సీజన్.. ఓ నాలుగు పెంచండి...

First Published May 26, 2021, 12:21 PM IST

కరోనా సెకండ్ వేవ్.. నేరుగా ప్రాణవాయువు మీద దెబ్బ కొడుతోంది. ఆక్సీజన్ అందక చనిపోతున్న వారు.. శ్వాససమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆక్సీజన్ ఇచ్చే మొక్కలు, గాలిని శుభ్రపరిచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే మొక్కల్ని పెంచుకోవడం చాలా అవసరం. 

కరోనా సెకండ్ వేవ్.. నేరుగా ప్రాణవాయువు మీద దెబ్బ కొడుతోంది. ఆక్సీజన్ అందక చనిపోతున్న వారు.. శ్వాససమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆక్సీజన్ ఇచ్చే మొక్కలు, గాలిని శుభ్రపరిచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే మొక్కల్ని పెంచుకోవడం చాలా అవసరం.
undefined
దీంతో పుష్కలంగా ఆక్సీజన్ ఇంట్లోనే లభిస్తుంది. అంతేకాదు ఇంట్లోని ఓ పచ్చని మొక్క ఇంటి అందాన్ని మార్చేస్తుంది. ఆహ్లాదాన్ని పంచుతుంది. లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం తో ఇంటికే పరిమితమవుతున్న నేటి రోజుల్లో ఇంట్లోనే ఇలాంటి మొక్కల్ని పెంచుకోవడం ఎంతైనా అవసరం.. అలాంటి మొక్కలేమిటో ఒకసారి చూడండి..
undefined
చైనీస్ ఎవర్ గ్రీన్ (chinese evergreens) : వీటినే ఇండోర్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు. మీరు ఇంట్లో ఎక్కువ సేపు ఉంటున్నట్లైతే ఈ మెుక్కలు తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోండి. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా, గాలిలోని హానికారక పదార్థాలను పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.
undefined
పీస్ లిల్లీ (peace lily) : పేరులాగే మొక్క అందంగా ఉంటుంది. అనేక ప్రయోజనాలూ కల్పిస్తుంది. ముదురాకుపచ్చ రంగు ఆకులతో... తెలటి పూలతో పీస్ లిల్లీ చూడగానే శాంతిని కలగజేస్తుంది. దీంతోపాటు పుష్కలంగా ఆక్సీజన్ ను అందిస్తుంది.
undefined
మనీ ప్లాంట్ (money plant) : ఈ మొక్కలు చాలామందికి తెలుసు. మట్టిలో, నీళ్లలో ఎక్కడ పెట్టినా ఇట్టే పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే డబ్బులకు కొదవ ఉండదని నమ్ముతారు. కానీ ఈ ప్లాంట్ కూడా గాలిని శుద్ది చేసి ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుందని చాలామందికి తెలియదు.
undefined
అరిక పామ్ (areca palm) : కొబ్బరి చెట్టులా అనిపించే ఈ మొక్కతో ఇల్లు మరింత అందంగా మారుతుంది. అతి తక్కువ వెలుతురు దీనికి సరిపోతుంది. మొక్కను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆక్సిజన్ స్థాయిల్ని పెంచుతుంది.
undefined
స్నేక్ ప్లాంట్ (snake plant) : పేరుకు తగ్గట్టే ఈ మొక్కలు పాముల్లా మెలికలు తిరిగి ఉంటాయి. వీటితో గది అందమే మారిపోతుంది. ఈ మొక్కలు గాల్లోనుంచి గ్జైలీన్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికారక పదార్థాలను తొలగిస్తాయి. స్వచ్ఛమైన ఆక్సీజన్ ను అందిస్తాయి.
undefined
జెర్బరా డైసీ (gerbera daisy) : మొక్కతో పాటు రంగు రంగుల పూలతో అందంగా ఆహ్లాదపరుస్తాయి ఈ మొక్కలు. వీటివల్ల ఆక్సీజన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ మొక్క మంచి ఎయిర్ ఫ్యూరిఫైర్ గా కూడా పనిచేస్తుంది.
undefined
click me!