fact check : ఉల్లిగడ్డలు, రిఫ్రిజిరేటర్ వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా?

First Published May 27, 2021, 4:42 PM IST

బ్లాక్ ఫంగస్ ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు జనాల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కరోనా కంటే డేంజర్ గా మారిన బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో అనేక అపోహలూ చక్కర్లు కొడుతున్నాయి. 

బ్లాక్ ఫంగస్ ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు జనాల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కరోనా కంటే డేంజర్ గా మారిన బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో అనేక అపోహలూ చక్కర్లు కొడుతున్నాయి.
undefined
బ్లాక్ ఫంగస్ అలా వస్తుంది.. ఇలా వస్తుంది అంటూ ఎన్నో రకాల సమాచారం సోషల్ మీడియాలో వరదలా ముంచేస్తుంది. వాటిల్లో చాలావరకు అవాస్తవాలే. అవే జనాల్ని భయాందోళనల్లో కి నెట్టేస్తున్నాయి.
undefined
అందులో ఒకటే ఉల్లిపాయలు, ఫ్రిడ్జ్ తో బ్లాక్ ఫంగస్ వస్తుందనే వాదన. ఓ ఫేస్ బుక్ యూజర్ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ.. ’ఉల్లిపాయలు కొనేముందు జాగ్రత్త.. దాని మీద ఉండే నలుపు మచ్చలు, పొరల మధ్య ఉండే నల్లదనంతో బ్లాక ఫంగస్ వస్తుంది. దాన్ని మీరు కూరల్లో వాడడం వల్ల తొందరగా ఎఫెక్ట్ అవుతారంటూ’ పోస్ట్ పెట్టాడు.
undefined
ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. జనాల్లో ఉల్లిపాయలు కొనాలంటే దడ పుట్టేలా చేసింది. అలాంటిదే మరో వైరల్ పోస్ట్ ఏంటంటే.. ‘రిఫ్రిజిరేటర్ లో అప్పుడప్పుడూ వచ్చే నల్లటి ఫంగస్ వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని’ దాని సారాంశం.
undefined
అయితే దీంట్లో వాస్తవం లేదనేం కానీ.. అది బ్లాక్ ఫంగస్ కు దారి తీయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రిఫ్రిజిరేటర్ లో పెరిగే ఫంగస్ బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల వస్తుంది. దీనివల్ల కొంత ఇబ్బందులు వస్తాయి కానీ బ్లాక్ ఫంగస్ కాదు.
undefined
ఇక ఉల్లిగడ్డల మీద, దాని పొరల మధ్యలో ఉండే నల్లటి ఫంగస్ మామూలుగా మట్టిలో ఉండే ఫండస్ మాత్రమే. దీనికి బ్లాక్ ఫంగస్ కు ఎలాంటి సంబంధం లేదు.
undefined
కాకపోతే కూరగాయలు, పండ్లు వాడేముందు తప్పనిసరిగా రన్నింగ్ టాప్ ముందు బాగా కడగాలి.
undefined
అయితే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చాలా భిన్నంగా ఉంది. దీనికి అనేక లక్షణాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మరణాల రేటు 50% ఉంది. 'మైకోర్మెట్స్' అని పిలువబడే ఫంగల్ మౌల్డ్స్ ద్వారా వ్యాపించే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వాతావరణంలో ఉంటుంది.
undefined
అపరిశుభ్ర వాతావరణంలో ఉండే వ్యక్తులకు, అధిక తేమతో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో ఉండేవారికి తొందరగా సోకుతుంది. ఇది తినే ఆహారం, తాకే వస్తువులతో రాదు.
undefined
COVID- కేసులలో ఆక్సిజనైజేషన్ కోసం ఉపయోగించే ఫిల్టర్ చేయని లేదా అపరిశుభ్రమైన నీటి వల్ల వ్యాధి వ్యాప్తికి మూలం అని నివేదికలు సూచించాయి. ఎయిమ్స్ డైరెక్టర్, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రణదీప్ గులేరియా ప్రకారం బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు.
undefined
తీవ్రమైన మధుమేహం, రక్తంలో చక్కెర స్తాయిలు అధికంగా ఉన్నవారు, ఎక్కువ కాలం స్టెరాయిడ్ థెరపీని తీసుకున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు దీని బారిన పడతారు.
undefined
కాబట్టి అనవసర అపోహలు నమ్మి ప్రతీదానికి భయపడి ధైర్యాన్ని కోల్పోకండి. అసలు వాస్తవాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.
undefined
click me!