ఈ క్రమంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ కూడా స్పందించింది. ఆమె ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా గురించి ఆలోచించే వారికి, నన్ను చూసే వారికి, నా గురించి వినేవారికి, నాతో మాట్లాడేవారికి, నా గురించి రాసేవారికి, నన్ను కలిసేవారికి ప్రేమతో, ఆశీర్వాదాలతో నా ప్రేమని పంపుతున్నాను` అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడితో తమ బాండింగ్ బాగుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది.