నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, వ్యవసాయ అధికారులతో సమావేశం కానున్న సీఎం రైతు భరోసాకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పట్లోపు పడతాయన్నదానిపై పూర్తి క్లారిటీ రానుంది.
మరో పది పదిహేను రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో రైతులు పంటలు వేసేందకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం అందిస్తే ఆ డబ్బులు రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లే వర్షాకాలం మొదలయ్యేలోపు రైతు భరోసాను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.