గోవా
గోవాను ఇష్టపడనివారు ఉండదు. నిజానికి గోవా సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ డిసెంబర్ లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ నెల స్టార్టింగ్ లోనే ఇక్కడికొచ్చి న్యూ ఇయర్ తర్వాత వెళ్తుంటారు. గోవా మధ్యలో.. అందమైన రాత్రి మీకు ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ను మీరు ఎప్పుడూ చూడరు. కానీ క్రిస్మస్ పండుగను కూడా ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడి చర్చిలే కాదు.. వీధులు, భవనాలను కూడా రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఇది గోవా అందాన్ని మరింత పెంచుతుంది.