శాంటాక్లాజ్ తాతకు ఇంత కథ ఉందా?

First Published Dec 19, 2023, 9:58 AM IST

Christmas 2023: క్రిస్మస్ రోజున ఎర్రని దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ.. పిల్లల్ని నవ్విస్తూ.. పిల్లలకు ఇష్టమైన గిఫ్టులను ఇచ్చే శాంటాక్లాజ్ తాత గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అసలు శాంటాక్లాజ్ ఎవరు? ఈ తాత ఎందుకు పిల్లలకు ఇష్టమైన గిఫ్టులను ఇస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Christmas 2023: ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంటాక్లాజ్ తాత గల్లీలో తిరుగుతూ పిల్లలకు ఎన్నో బహుమతులు ఇస్తుండటాన్ని చూసే ఉంటారు. ముఖ్యంగా క్రిస్మస్ రాత్రి పూట శాంటాక్లాజ్ పిల్లలకు బహుమతులను ఇస్తుంటాడు. క్రిస్మస్ ను యేజు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని  ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాజ్ గురించి ఎందుకు ఎందుకు ప్రస్తావిస్తారు? ఈ తాత కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

శాంటా క్లాజ్ ఎవరు?

శాంటా క్లాజ్ అసలు పేరు శాంటా నికోలస్. ఇతను తుర్కిస్థాన్ లోని మైరా అనే నగరంలో పుట్టారు. చరిత్రకారుల ప్రకారం.. నికోలస్ యేసుప్రభు మరణానంతరం జన్మించారు. ఇతను పర్వతాలపై మంచు ప్రదేశాల్లో నివసించేవారని నమ్ముతారు. కానీ క్రిస్మస్సందర్భంగా నికోలస్ పిల్లలకు బహుమతులు ఇచ్చేవారట. నిజానికి యేసుప్రభువుకు, శాంతాక్లాజ్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. కానీ శాంతా క్లాజ్ కు క్రిస్మస్ నాడు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. 

Latest Videos


ఒక కథ ప్రకారం.. శాంటాక్లాజ్ ఒక నిరుపేద వ్యక్తి ఇంట్లో ఎంతో ఆనందాన్ని నింపాడు. ఎలాగంటే? ఒక వ్యక్తి చాలా బీదవాడు. అతనికి ముగ్గురు కూతుర్లు కూడా ఉంటారు. పేదరికం కారణంగా అతనికి కూతుర్ల పెళ్లి చేయడం కష్టంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నికోలస్ బంగారు నాణేలను నింపిన సాక్సులను ఆ పేదవాడి ఇంట్లోకి వేసి.. వారి కష్టాన్ని పోగొడుతాడు. అందుకే శాంటాక్లాజ్ కు ఇంత ప్రత్యేకత ఉంది. ఆ ఒక్క కుటుంబానికే కాదు ఇలా ఎన్నోకుటుంబాలకు శాంటాక్లాజ్ ఎంతో సాయం చేసేవాడు. అప్పటి నుంచి ఇప్పటికీ.. క్రిస్మస్ సందర్భంగా చాలా మంది తమ ఇళ్ల బయట సాక్సులు వేలాడదీస్తారు. 
 

నికోలస్ ఎప్పుడు శాంటాక్లాజ్ అయ్యారు? 

నికోలస్ తన తల్లిదండ్రుల మరణం తర్వాత చాలా చిన్న వయస్సులోనే శాంటాక్లాజ్ అయ్యాడు. సెయింట్ నికోలస్ స్వభావరీత్యా చాలా దయగలవాడని, పిల్లలంటే ఆయనకు ఎంతో ఇష్టమని నమ్ముతారు. ఈ కారణంగానే ఇతను పిల్లలకు ఎన్నో బహుమతులు కూడా ఇచ్చాడని నమ్ముతారు.
 

santa claus


అంతేకాదు.. తాను చనిపోయిన తర్వాత కూడా క్రిస్మస్ రోజున అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి వెళ్లేవాడని నమ్ముతారు. పిల్లలు కూడా తనని గుర్తుపట్టకుండా చీకట్లో బహుమతులు ఇచ్చేవాడట.

శాంటా క్లాజ్ ఊరు గురించి..

ఫిన్ లాండ్ లోని రోవానియేమిలో ఉన్న శాంటా క్లాజ్ గ్రామం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశంలో శాంటాక్లాజ్ కార్యాలయం కూడా ఉందట. అక్కడ ప్రజలు ఇప్పటికీ తమ లేఖలను ఆ కార్యాలయానికి పంపుతారని.. ఆ కార్యాలయంలోని ప్రధాన ఉద్యోగులు ఈ లేఖలకు తెలుపు గడ్డం, ఎరుపు దుస్తుల్లో శాంటా క్లాజ్ వేషధారణలో సమాధానం ఇస్తారని చెప్తారు. 

click me!