ప్రతి ఏడాది డిసెంబర్ 25 న ఘనంగా క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పవిత్రమైన రోజున క్రైస్తవులు చర్చీలకు వెళ్లి యేసు ప్రభువును ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ రోజున కొవ్వుత్తులను వెలిగించడం, బహుమతులను ఇవ్వడం, యేసు ప్రభువు గురించి పాటలు పాడటం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రీస్తు జననం గురించి ప్రదర్శించడం, క్రిస్మస్ చెట్టు వంటివి ప్రత్యేకంగా నిలుస్తాయి. వీటికి తోడు శాంతా క్లాజ్, ఫాదర్ క్రిస్మస్ వంటి పాత్రలు చిన్న పిల్లలతో సరదాగా ఆడి పాడటం, వారికి చాక్లెట్లు, బహుమతులను పంచే సాంప్రాదాయాలు కనువిందు చేస్తుంటాయి.