ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే జంటలు బాగా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే ఆ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందే ఉన్నారు. అయితే.. ఈ విడాకులు.. వారి కంటే... వారి పిల్లలనే ఎక్కువ ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. పేరెంట్స్ విడిపోయిన తర్వాత... చాలా మంది పిల్లలు సింగిల్ పేరెంటింగ్ కిందకు వెళ్లిపోతారు. ఇది పిల్లల జీవితాలపై చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే... ఈ కింది సెలబ్రెటీలు మాత్రం.. వారు భార్యభర్తలు గా విడిపోయినా.. తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటున్నారు. అంటే... తాము విడిపోయినా.. పేరెంట్స్ గా.. తమ పిల్లల సంరక్షణ కలిసే చూసుకుంటున్నారు. మరి ఆ సెలబ్రెటీలు ఎవరో ఓసారి చూద్దాం...
1.హార్దిక్ పాండ్యా-నటాషా..
ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా రీసెంట్ గా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోగా... వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. వీరిద్దరూ తాము విడిపోయినా.. పేరెంట్స్ గా తమ కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఏ నిర్ణయం అయినా ఇద్దరం కలిసే తీసుకుంటామని.. తమ కుమారుడి సంతోషం కోసం తాము ఏదైనా చేస్తామని, పేరెంట్స్ గా ఒకరి కోసం ఒకరు సహకరించుకుంటాం అని చెప్పడం విశేషం.
Hrithik Roshan and Sussanne Khan
2.హృతిక్ రోషన్-సుస్సేన్ ఖాన్..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన భార్య సుస్సేన్ ఖాన్ తో విడిపోయారు. దాదాపు పెళ్లైన 13 సంవత్సరాల తర్వాత వీరు విడిపోవడం గమనార్హం.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2006లో జన్మించిన హ్రేహాన్ , 2008లో జన్మించిన హృదాన్. అయితే.. తమ విడాకులు పిల్లల జీవితాన్ని ఇబ్బంది పెట్టకూడదని వారు భావించారు. తాము విడిపోయినా.. పిల్లల విషయంలో ఇద్దరూ కేర్ తీసుకుంటారు. హృతిక్ రోషన్ , సుస్సానే ఖాన్ తరచుగా వారి కుమారుల పాఠశాల , కళాశాల ఈవెంట్లలో లేదా కుటుంబ సమావేశాలలో కలిసి కనిపిస్తారు. హృతిక్ కూడా కొన్నిసార్లు తన కొడుకులతో క్వాలిటీ టైమ్ గడపడానికి వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఉంటాడు.
3.మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్..
బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ లు.. కూడా 19ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోయారు. వీరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. మలైకా ,అర్బాజ్ 2017లో విడిపోయినప్పటికీ, వారి కొడుకు సహ-తల్లిదండ్రుల విషయానికి వస్తే వారు స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉన్నారు. కొడుకు విషయంలో ఏ నిర్ణయం అయినా కలిసే తీసుకుంటారు.
Aamir Khan, Reena Dutta, Kiran Rao
4.అమీర్ ఖాన్ -రీనా దత్త
నటుడు అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఈ మాజీ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు-- కూతురు ఇరా , కుమారుడు జునైద్. అమీర్ రీనా 1986లో మతపరమైన విభేదాల కారణంగా పారిపోయి వివాహం చేసుకున్నారు. కానీ తర్వాత విడిపోయారు. కానీ ఇప్పటికీ పిల్లల జీవితంలో ముఖ్యమైన విషయాల్లో వారిద్దరూ కలిసే ఉంటారు. కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. కో పేరెంటింగ్ చేశారు. అమీర్ ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకోగా.. ఆమెతో విడిపోయారు. ఈ జంటకు ఉన్న కుమారుడు ఆజాద్ విషయంలోనూ వీరు కోపేరెంటింగ్ నిర్వహిస్తుండటం విశేషం.
Amrita Singh and Saif Ali Khan
5.సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్..
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్ తో విడిపోయిన విషయం తెలిసిందే. వివాహం జరిగిన 13ఏళ్లకు విడిపోయారు. అప్పటికే వారికి సారా అలీఖాన్, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. వారు విడిపోయినా.. సైఫ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ.. తమ పిల్లలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ పిల్లల బాధ్యత చూసుకుంటూనే ఉాంటాడు. మరో విషయం ఏమిటంటే.. సైఫ్ రెండో భార్య కరీనాతో... సారా, ఇబ్రహీం చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటారు.