ఆర్యతో మొదలైన అద్భుతమైన జర్నీ..ఎండ్ కార్డ్ పడినట్లేనా, అల్లు అర్జున్ కి కూడా గుడ్ బై ?

First Published | Nov 25, 2024, 11:49 AM IST

గత 20 ఏళ్లలో సౌత్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో సంచలనాలు సృష్టించారు. కమర్షియల్ సినిమాకి ఎలాంటి ఎనెర్జిటిక్ ఆల్బమ్ అందించాలో దేవిశ్రీకి బాగా తెలుసు.

గత 20 ఏళ్లలో సౌత్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఎన్నో సంచలనాలు సృష్టించారు. కమర్షియల్ సినిమాకి ఎలాంటి ఎనెర్జిటిక్ ఆల్బమ్ అందించాలో దేవిశ్రీకి బాగా తెలుసు. చిరంజీవి, నాగార్జున వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల నుంచి నిన్నమొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు ఎప్పటికీ మరచిపోలేని సంగీతం అందించిన ఘనత దేవిశ్రీ ప్రసాద్ ది. 

కానీ తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో తీవ్రమైన వివాదంతో వార్తల్లో నిలిచాడు. దేవిశ్రీ ప్రసాద్ అందరు హీరోలతో సినిమాలు చేసినట్లే.. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తో పనిచేశారు. అయితే ఎప్పటికీ మరచిపోలేని కాంబినేషన్ మాత్రం సుకుమార్ - దేవిశ్రీ లదే అని చెప్పొచ్చు. ఆర్య నుంచి మొదలు పెడితే పుష్ప 2 వరకు సుకుమార్ ప్రతి చిత్రానికి దేవిశ్రీనే సంగీత దర్శకుడు. సుకుమార్ కి దేవిశ్రీ అంతే అంత నమ్మకం. 


ఇలాంటి సాలిడ్ కాంబినేషన్ కి, వీళ్ళ ఫ్రెండ్ షిప్ కి బ్రేక్ పడ్డట్లు ఇండస్ట్రీలో టాక్. చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ బహిరంగంగా సంచలన వ్యాఖలు చేశారు. నిర్మాతలపై చిర్రుబుర్రులాడాడు. పుష్ప 2 బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తనని తప్పించి తమన్ లాంటి వాళ్ళని తీసుకున్నారు. దేవీశ్రీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది అవమామే. పుష్ప 2 లాంటి భారీ చిత్రానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు అనేది చిత్ర యూనిట్ నుంచి ఇన్సైడ్ టాక్. 

సాంగ్స్, రీరికార్డింగ్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ బాగా ఆలస్యం చేశాడు అనే కంప్లైంట్ వినిపిస్తోంది. చిన్న తప్పు జరిగినా వందల కోట్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టే దేవిశ్రీని తప్పించారనేది బలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల దేవిశ్రీ ప్రసాద్ ఎంతగా హర్ట్ అయ్యారో చెన్నై ఈవెంట్ లో చూశాం. అల్లు అర్జున్ ముందే నిర్మాతలపై విరుచుకుపడ్డాడు దేవిశ్రీ. అయితే ఈ నిర్ణయంలో అల్లు అర్జున్, సుకుమార్ ప్రమేయం లేకుండా ఉండదు. కానీ అంతటి స్టార్లని పబ్లిక్ గా దేవిశ్రీ కామెంట్ చేయలేడు. అందుకే నిర్మాతలని టార్గెట్ చేసి తన అసంతృప్తి బయట పెట్టాడు. 

Pushpa 2

అల్లు అర్జున్, సుకుమార్ విషయంలో కూడా దేవిశ్రీ బాగా నిరాశలో ఉన్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ తో ఆర్య చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ జర్నీ ప్రారంభం అయింది. సుకుమార్ తో కూడా అదే చిత్రంతో మొదలయింది. ఆర్య, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇద్దరమ్మాయిలతో, పుష్ప ఇలా అల్లు అర్జున్, దేవిశ్రీ కాంబోలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ పై దేవిశ్రీ పైకి ప్రేమ కురిపించాడు. కానీ ఇకపై అల్లు అర్జున్ తో కానీ, సుకుమార్ తో కానీ దేవిశ్రీ సినిమాలు ఉండే అవకాశం లేదు అనేది బలంగా వినిపిస్తున్న రూమర్. దీనిపై సుకుమార్ క్లారిటీ ఇస్తే కానీ ఒక అంచనాకు రాలేం. 

Latest Videos

click me!