కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేసి చూడండి..!

First Published | Nov 25, 2024, 11:07 AM IST

ఉప్పు లేకుండా భోజనం రుచిగా ఉండదు. అదేవిధంగా  ఉప్పు ఎక్కువ అయినా తినలేం. అయితే.. మనం కొన్ని మార్పులు చేసి.. మళ్లీ వంటను రుచిగా మార్చుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

వంట చేయడం అంత సులువైన విషయం కాదు. దానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక.. వంట కమ్మగా చేయాలంటే మరింత శ్రమ పెట్టాలి. కానీ.. ఒక్కోసారి ఈ వంట విషయంలోనూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాటున తెలీకుండానే ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటాం. నిజానికి ఉప్పు లేకుండా భోజనం రుచిగా ఉండదు. అదేవిధంగా  ఉప్పు ఎక్కువ అయినా తినలేం. అయితే.. మనం కొన్ని మార్పులు చేసి.. మళ్లీ వంటను రుచిగా మార్చుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

1.గ్రేవీ ఉన్న కూరల్లో ఉప్పు ఎక్కువగా అయితే.. కొద్దిగా నిమ్మరసం పిండొచ్చు.  ముఖ్యంగా ఏదైనా పచ్చడిలో ఉప్పు ఎక్కువ అయితే.. ఇలా నిమ్మరసం పిండటం వల్ల ఉప్పు తగ్గుతుంది.

2.సాంబారు లో ఒకవేళ ఉప్పు ఎక్కువ అయితే… అందులో మరింత పప్పు చేరిస్తే సరిపోతుంది. ఉప్పు శాతం తగ్గుతుంది. లేదు అంటే… టమాట మిక్సీ పట్టి.. దానిని ఆ సాంబారులో చేర్చినా కూడా ఉప్పు తగ్గుతుంది. మళ్లీ.. సాంబారు రుచిగా మారుతుంది. 

Latest Videos


3.కొందరు సాంబారులో  బెల్లం తినడాన్ని ఇష్టపడతారు. అలాంటివారు ఉప్పు ఎక్కువైనప్పు బెల్లం లేదా, పంచదార చేరిస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది. 

4.చపాతీకి గ్రేవీ చాలా ఉప్పగా ఉంటే బెల్లం లేదా పంచదార వేయాలి. లేదా కొబ్బరి పాలు, నెయ్యి, పెరుగు మొదలైన వాటిని కలపండి. 

బంగాళదుంపలు, అరటిపండ్లు, యాలకులు , ఇతర వేయించిన ఆహారాలలో ఉప్పు కలిపితే రుచిగా ఉంటుంది. వేపుళ్లు చాలా ఉప్పగా ఉంటే, చిక్‌పీస్‌ను మెత్తగా రుబ్బుకుని పైన కొద్దిగా చల్లుకోవాలి.

బిర్యానీ చాలా ఉప్పగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఉప్పు తగ్గుతుంది.

కొబ్బరి అన్నం, లెమన్ రైస్, టొమాటో రైస్ చాలా ఉప్పగా ఉంటే, కొద్దిగా వడకట్టిన అన్నం వేయండి. ఖచ్చితంగా ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంటుంది.

ఏదైనా గ్రేవీ కర్రీ చాలా ఉప్పగా ఉంటే, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని బాగా మెత్తగా చేయాలి. లేదా గ్రేవీలో తురిమిన కొబ్బరి ,గసగసాలు వేస్తే ఉప్పు తగ్గుతుంది. కూరకు రుచి పెరుగుతుంది.

click me!