డబ్బు సంతోషాన్ని కొనగలదా?

First Published | Jan 7, 2024, 11:45 AM IST

డబ్బు.. డబ్బు.. డబ్బు.. డబ్బుంటేనే అన్ని పనులు అవుతాయి. డబ్బుంటేనే మనం ఆనందంగా, సుఖంగా ఉంటాం.. అనేవాళ్లు ఎక్కువే. ఏదేమైనా డబ్బుతో చాలా పనులు ముడిపడి ఉన్నాయి. కానీ డబ్బుతోనే సంతోషమంటే మీరు నమ్ముతారా? దీనికి అంగీకరిస్తారా? 

money

డబ్బు సంతోషాన్ని కొనగలదా అనే పాత ప్రశ్న అందరికీ తెలిసిందే. దీనికి కొందరు అవును అంటే.. మరికొందరు కాదని అని సమాధానమిస్తుంటారు. ఏదేమైనా.. మన జీవితంలో డబ్బు పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. ఎందుకంటే డబ్బుతోనే ఎన్నో పనులు అవుతాయి. అలా అని అన్నీ అని చెప్పలేం. ఎందుకంటే డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. అందులో సంతోషం ఒకటి. అయితే మనలో చాలా మంది దీనికి అంగీకరించరు. ఆనందానికి కూడా డబ్బు ఉండాల్సిందేనంటారు. మరి దీనిపై మీరేమంటారు? మీరేమి అన్నా.. అనకున్నా.. పరిశోధకులు మాత్రం ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. అదేనండీ.. నిజంగా డబ్బు సంతోషాన్ని కొంటుందా? లేదా? అని. మరి దీనిపై పరిశోధకులు ఏమంటున్నారో చూసేద్దాం పదండి.
 


డబ్బు సంతోషాన్ని కొనగలదా?

ఒక నిర్దిష్ట ఆదాయ పరిమితికి చేరుకున్న తర్వాత ఆనందం పెరుగుతుందనే నమ్మకాన్ని.. ఇటీవల పరిశోధకులు డేనియల్ కాహ్నెమన్, మాథ్యూ కిల్లింగ్స్వర్త్ చేసిన సంయుక్త అధ్యయనం సవాలు చేసింది. స్మార్ట్ ఫోన్ యాప్ ను ఉపయోగించి వీరిద్దరూ.. 33,000 మందికి పైగా పాల్గొన్నవారి నుంచి దీనికి సంబంధించిన డేటాను సేకరించారు. పెరుగుతున్న ఆదాయాలతో పాటుగా ఆనందం పెరుగుతూనే ఉందని ఇది సూచిస్తుంది. ఎక్కువ సంపాదన ఉన్నవారితో పోలిస్తే తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులు పెరిగిన ఆదాయం నుంచి ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. 
 

Latest Videos



అధ్యయన ఫలితాలు

పరిశోధకులు స్వీయ-మూల్యాంకనంపై ఎక్కువ ప్రభావాన్ని కనుగొన్నారు. ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తులు మరింత సానుకూల స్వీయ-అవగాహనను కలిగి ఉంటారని సూచిస్తున్నారు. ఆదాయంతో పాటు మానసిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది. కానీ వార్షిక వేతనం 75,000 డాలర్ల వరకు మాత్రమే. ఈ దశకు మించి ఎక్కువ జీతాలు వచ్చినా సంతోషం పెరగదు. అంటే ఇది డబ్బు, శ్రేయస్సు మధ్య సంబంధానికి ఒక పరిమితిని సూచిస్తుంది. అంటే కొంతవరకు ఆదాయం పెరిగితేనే సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. ఒర పరిమితికి మించి ఆదాయం పెరిగినా పెద్దగా ఆనందం కలగదన్న మాట.
 

అయితే ఈ ఫలితాలలో వైరుధ్యాలు కూడా ఉన్నాయి. Killingsworth 2021 అధ్యయనం 500,000 డాలర్లు అటే సుమారు రూ.4 కోట్లు ఆదాయం వరకు ఆనందంపై డబ్బు  సానుకూల ప్రభావాన్ని సూచించింది. అంటే ఇంత ఆదాయం పెరిగితే ఆనందం పెరుగుతుందన్న మాట. అయినప్పటికీ, 100,000 డాలర్లు అంటే సుమారుగా రూ.83 లక్షలు కంటే ఎక్కువ జీతం ఉన్న వ్యక్తులు సంపద పెరిగినప్పటికీ.. వీరి ఆనందం, శ్రేయస్సులో మెరుగుదల ఉండకపోవచ్చు. 

డబ్బు సరిపోదు..

హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ నొక్కిచెప్పినట్టుగా.. ఆనందాన్ని పొందడంలో సంబంధాలే కీలక పాత్ర పోషిస్తాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మంచి జీవితానికి సంబంధాలు చాలా చాలా అవసరం. అలాగే సంపద ప్రభావానికి పరిమితులు కూడా ఉన్నాయి. భౌతికేతర అనుభవాల పరంగా.. గాలప్ వరల్డ్ పోల్ అటువంటి అనుభవాలు తరచుగా భౌతిక ఆస్తుల కంటే ఆనందాన్ని అందించడంలో ఉన్నత స్థానంలో ఉన్నాయని సూచిస్తుంది. కొంతమంది వ్యక్తులు వారి సామాజిక సంబంధాలు, ఆనందాన్ని పెంపొందించడానికి భౌతిక ఆస్తుల కంటే ప్రయాణం, కచేరీలు, కమ్యూనిటీ నిమగ్నత వంటి అనుభవాలకు ప్రాధాన్యతనిస్తారు.
 


దయగా ఉండటం 

2008 లో ఎలిజబెత్ డన్, ఆమె సహచరులు నిర్వహించిన ఒక అధ్యయనంలో.. కెనడాలోని వాంకోవర్ లోని ఒక వీధిలో నడుస్తున్న ప్రజలకు $ 5 లేదా $ 20 నోటు ఉన్న కవరు ఇచ్చారు. దీనిలో పాల్గొన్న వారిని రెండు గ్రూపులుగా విభజించారు. అయితే ఒక గ్రూపు  వారిని ఆ డబ్బును తమ ఖర్చులకోసం వాడుకోమని చెప్పారు. ఇంకో గ్రుపు వారిని ఆ డబ్బును మరొకరికి బహుమతి కొనమని లేదా డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించారు. అయితే తమ కోసం ఖర్చుచేయడం కంటే.. పరోపకార పనులకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ ఆనందానికి దారితీస్తుందని అధ్యయనం చివరికి పేర్కొన్నది.
 

కొలంబియాలోని మిస్సోరి-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజికల్ సైన్సెస్ విభాగానికి చెందిన పరిశోధకులు టిటోవా, షెల్డన్ చేసిన అధ్యయనాలు.. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి పనులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఇవి వ్యక్తిగత ఆనందాన్ని పెంచుతాయని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాలన్నీ.. ఒక వ్యక్తి శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని కూడా నొక్కి చెప్పాయి. ఇతరుల ఆనందానికి దోహదం చేయడమే సంతోషాన్ని పెంచుతుందని తేల్చి చెప్పాయి. 
 

ఆనందం అనేది ఒక మానసిక స్థితి

బాగా ఆదాయాన్ని సంపాదించడం మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుందని కేవలం అపోహ. ప్రసిద్ధ అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు బిల్లీ గ్రాహం ఒకసారి ఇలా అన్నాడు, "సంపద పోయినప్పుడు.. ఏమీ కోల్పోము. కానీ ఆరోగ్యం పోయినప్పుడు, ఖచ్చితంగా ఏదో కోల్పోతాం. ఇక ఈ భూమిపై మన పాత్ర ముగిసినప్పుడు అంతా పోతుంది". అందుకే ఆర్థిక విజయంతో పాటుగా శ్రేయస్సుకు ఒకరి వ్యక్తిత్వం, విలువలు కీలక పాత్ర పోషిస్తాయి.

click me!