క్రమం తప్పిన పీరియడ్స్.. గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తాయా?

First Published Oct 11, 2021, 12:13 PM IST

 జీవనశైలి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొత్తం ఆరోగ్యంపై సమస్యాత్మక ప్రభావాలకు దారితీస్తుంది, బరువు పెరగడం, హార్మోన్ల అంతరాయం, పీరియడ్ ఫ్లో సరిగా లేకపోవడం, పునరుత్పత్తి సమస్యలు, జీవక్రియ వ్యత్యాసాల ప్రమాదాన్నిచూపిస్తుంది. 

మహిళల ఆరోగ్యం వారి నెలవారీ రుతుచక్రం మీద ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పని పీరియడ్స్ వారి ఆరోగ్యానికి మంచి సంకేతంగా గుర్తించబడతాయి. అయితే పీరియడ్స్ క్రమం తప్పి రావడం.. ఆందోళన కలిగించే విషయం. 

దీనివల్ల PCOS ప్రమాదం, ఒత్తిడి, పునరుత్పత్తి లాంటి వాటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొంతమంది డాక్టర్ల ప్రకారం క్రమరహితమైన పీరియడ్స్ మీ గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి, అయితే ఇది ఎంత వరకు ప్రమాదకరం... పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి కారణాలేంటి? దానికి ఏం చేయాలి అనేది తెలిసుంటే.. సమస్య ఉండదు. 

పీరియడ్స్ క్రమం తప్పడానికి అనేక కారణాలు ఉండొచ్చు. పిసిఒఎస్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ క్రమరహిత రుతుక్రమానికి దారితీసే ప్రధాన కారణాలలో ఒకటి. గర్భధారణ వయసులో ఉన్న మహిళల్లో ఎనిమిది మందిలో ఒకరికి ఈ పిసిఒఎస్ ఉంది. క్రమంగా ఇది ఒక అంటువ్యాధిగా మారడం ప్రారంభించింది. ఇటీవలి సంవత్సరాలలో వీటి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 

 జీవనశైలి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొత్తం ఆరోగ్యంపై సమస్యాత్మక ప్రభావాలకు దారితీస్తుంది, బరువు పెరగడం, హార్మోన్ల అంతరాయం, పీరియడ్ ఫ్లో సరిగా లేకపోవడం, పునరుత్పత్తి సమస్యలు, జీవక్రియ వ్యత్యాసాల ప్రమాదాన్నిచూపిస్తుంది. 

అయితే ఇది చాలా సాధారణ వ్యాధిలా కనిపించినప్పటికీ చాలా మంది మహిళలకు వారి లక్షణాల గురించి స్పష్టంగా తెలియదు లేదా తప్పుగా అంచనా వేస్తారు. పిసిఒఎస్‌తో బాధపడుతున్నా కూడా దాని గురించి  అవగాహన తక్కువగా ఉంటుంది. ఇది వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా, రోగ నిర్ధారణ ఆలస్యం కావడం,పూర్తి ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి వాటికి దారితీస్తుంది. ముఖ్యంగా ప్రమాదాన్ని గుర్తించడంలో ఆలస్యం చేయడం వల్ల గుండెకు చాలా చేటు జరుగుతుంది. 

PCOS, పీరియడ్స్ సరిగా రాకపోవడం, గుండె ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? అంటే.... పీసీఓఎస్ ఉన్న  చాలా మంది మహిళలలో కనిపించే ప్రాథమిక లక్షణాలలో ఒకటి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం. హార్మోన్ల సమస్యల వల్ల పీరియడ్స్ విషయంలో ఇలా జరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతతో సహా జీవక్రియ వ్యత్యాసాలను మరింత భర్తీ చేస్తుంది. శరీరంలో male harmonesఅధిక స్థాయిలో ఉండటం, ఇన్సులిన్ నిరోధకతతో పాటు (ఇది మధుమేహం లక్షణం) కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్‌లను కూడా పెంచుతుంది. 

ఇది, పిసిఒఎస్ లేదా పీరియడ్ సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. పీరియడ్స్ లో తేడాలేని మహిళలతో పోలిస్తే.. క్రమరహిత పీరియడ్స్ తో బాధపడుతున్న మహిళల్లో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 28% ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. దీంతోపాటు, మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుందట. 

పీసీఓఎస్ గుండె సమస్యలకు దారి తీస్తుందనడానికి ప్రధాన కారణాలు కొన్ని.... ఉదాహరణకు, ఇన్సులిన్ నిరోధకత డయాబెటిస్‌కు మాత్రమే దారితీయదు, శరీరంలోని ఇతర జీవక్రియ ప్రభావాలను కూడా పెంచుతుంది. హృదయ సంబంధ దృక్కోణంలో, ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉండటం, అధిక ఒత్తిడికి లోనవడం, లిపిడ్ స్థాయిలను పెంచడం, ఇతర జీవక్రియ మార్పులు గుండె సమస్యల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. దీనికి నివారణగా ముందస్తు నిర్ధారణ, పీసీఓఎస్ నిర్వహణ ముఖ్యం అని చెబుతున్నారు.

పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలు బరువు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. అధిక బిఎమ్‌ఐ స్థాయిలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే మీరు పీసీఓఎస్ ను ఎలా ఎదుర్కోవాలి? దాన్నుండి మీ గుండె సమస్యల ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు..దానికి ఏం చేయాలో చూద్దాం.

పీసీఓఎస్ కు ప్రస్తుతం అందుబాటులో ఏ వైద్య చికిత్స లేదు. అయితే జీవనశైలిలో మార్పులతో మాత్రమే ఈ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అరికట్టడానికి వీలవుతుంది.దీనికోసం బరువు తగ్గాలి, మీ బరువు మీ వయస్సు, ఎత్తుకు తగినట్లుగా మంచి BMI స్థాయిల్లో ఉండేలా చూసుకోవాలి. 
ఆహారంలో మంచి అలవాట్లు నేర్చుకోవాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. ఆంటిఆక్సిడెంట్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

కొందరు మహిళలకు గ్లూటెన్-ఫ్రీ లేదా డైరీ-ఫ్రీగా ఫుడ్ మంచి మార్పులు చూపిస్తాయి. మీరు వారానికి 4-5 రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేసేలా చూసుకోవాలి. 
ఒత్తిడిని తగ్గించుకోండి. దీనికోసం యోగా, ధ్యానాన్ని ప్రయత్నించండి. గుండె ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ప్రాక్టీస్ చేయాలి. మంచి నిద్ర అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అని గుర్తుంచుకోవాలి. 

click me!