డ్యాన్స్ చేస్తే నిజంగా బరువు తగ్గుతరా?

First Published Feb 6, 2024, 11:51 AM IST

బరువు తగ్గడానికి నానా తిప్పలు పడుతుంటారు. ఇందుకోసం కొందరు ఫుడ్ ను తగ్గిస్తే.. కొంతమంది రోజూ వ్యాయామాలు చేస్తుంటారు. మరికొంతమంది డ్యాన్స్ చేస్తుంటారు. అవును డ్యాన్స్ తో కూడా బరువు తగ్గుతారని అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

డాన్స్ చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే చాలా మంది నలుగురిలో చేయడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే సిగ్గు అడ్డొస్తుంది కాబట్టి. కానీ నలుగురితో పాటుగా స్టెప్పులేస్తుంటారు. అలాగే  ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఇష్టమైన పాట పెట్టుకుని నచ్చినట్టుగా చిందులేస్తుంటారు. కొంతమందికి డ్యాన్సే వృత్తి అయితే.. మరికొంతమంది ఎంజాయ్ చేసేందుకు డ్యాన్స్ చేస్తారు. ఏదేమైనా డ్యాన్స్ మంచి ఆహ్లాదకరమైన ఫిట్నెస్ వ్యాయామాలలో ఒకటనే చెప్పాలి. నిజానికి డ్యాన్స్ మన శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును రెగ్యులర్ గా డ్యాన్స్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 

వెయిట్ లాస్

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే రెగ్యులర్ గా డ్యాన్స్ చేస్తే కూడా మీరు సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అవును డ్యాన్స్ ఒక గొప్ప కార్డియో వ్యాయామం. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం క్రమం తప్పకుండా మీకు నచ్చిన పాట పెట్టుకుని డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ మీ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీకు జిమ్ కు వెళ్లడం ఇష్టంలేకపోతే ఇంట్లోనే డ్యాన్స్ చేయండి. లావు తగ్గుతారు. 
 

గుండె ఆరోగ్యం

క్రమం తప్పకుండా డ్యాన్స్ చేయడం వల్ల హృదయ స్పందన రేటును సమతుల్యంగా ఉంటుంది. డ్యాన్స్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రోజుకు  ఒక అరగంట కంటే ఎక్కువసేపు డ్యాన్స్ చేసేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డ్యాన్స్ కూడా చేయొచ్చు. 
 

ఫ్యాట్

జుంబా, ఏరోబిక్స్ వంటివి నృత్యమే కాదు మంచి వ్యాయామం కూడా. ఇవి మీ కండరాల బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. అలాగే డ్యాన్స్ మీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మీరు మీ పొట్టను తగ్గించుకోవడానికి వీటన్నింటిని ఎంచక్కా ప్రాక్టీస్ చేయొచ్చు.
 

మానసిక ఆరోగ్యం

ప్రస్తుతం చాలా మంది మానసిక ఒత్తిడికి బాగా గురవుతున్నారు. అయితే డ్యాన్స్ కూడా ఈ రకమైన ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ మీలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. డ్యాన్స్ మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.

click me!