వేసవి విహారం...బడ్జెట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే..

First Published Mar 9, 2019, 3:10 PM IST

వేసవి అనగానే ముందుగా గుర్తొచ్చేది సెలవలే. పిల్లలు పరీక్షలు అయిపోగానే.. ఏదో ఒక టూర్ వేయాలని ప్లాన్ వేస్తుంటారు. రాష్ట్రం దాటి పోవాలంటే.. కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. 

వేసవి అనగానే ముందుగా గుర్తొచ్చేది సెలవలే. పిల్లలు పరీక్షలు అయిపోగానే.. ఏదో ఒక టూర్ వేయాలని ప్లాన్ వేస్తుంటారు. రాష్ట్రం దాటి పోవాలంటే.. కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. అందుకే బడ్జెట్ లో ఎంచక్కా.. మన రాష్ట్రంలోనే పలు ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. మరి ఆ ప్లేసెస్ ఎంటో ఒకసారి చూసేద్దామా..
undefined
హైదరాబాద్.. చూసే ఓపిక ఉండాలే గానీ.. హైదరాబాద్ లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. మహానగరంలో చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లతో పాటు అడుగడుగునా ఓ ఉద్యానవనం కనిపిస్తాయి.
undefined
చార్మినార్, లుంబినీ పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్, స్టేట్ మ్యూజియం, జీఎస్‌ఐ, నెహ్రూ జూపార్కు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. దేశం నలుమూలల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం ఉంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.
undefined
మెదక్.. ఆసియాలోనే అతిపెద్ద చర్చి ఇక్కడ ఉంది. తెల్లని గ్రానైట్‌తో నిర్మితమైన గోపురాలు ప్రత్యేక ఆకర్షణ. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాలలో ఎన్నో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అటవీ సంపద, నదీ జలాలు కనువిందు చేస్తున్నాయి
undefined
మంజీర నది ఒడ్డున ఏడుపాయల కనకదుర్గ దేవాలయం ఉంది. కొండాపూర్‌లోని పురావస్తు సంగ్రహాలయంలో బౌద్ధ నిర్మాణాలు, శాతవాహనుల కాలం నాటి అవశేషాలు ఎన్నో దర్శనమిస్తాయి
undefined
వరంగల్.. కాకతీయుల కాలంనాటి గొప్పదనాన్ని వరంగల్ లో చూడొచ్చు. రామప్ప దేవాలయం.. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం, రుద్రసముద్రం, ఉదయ సముద్రం, సమ్మక్క సారక్క తదితర పర్యాటక ప్రాంతాలను జిల్లాలో సందర్శించవచ్చు. జిల్లాల విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ప్రొ. జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయం. ఇక్కడే త్రివేణి సంగమం ఉన్నాయి.
undefined
పాపికొండలు.. పాపి కొండల ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఇక్కడి వాతావరణం ఎండాకాలం, వానా కాలం, చలికాలం అనే తేడా లేకుండా చల్లగానే ఉంటుంది. పాపి కొండల్లో బోట్ విహారం, గుడిసెలు, గోదావరి నదిలో ప్రయాణిస్తూ అల్పాహారం,భోజనం చేయటం వంటివి మారుపురానివి. రాజమండ్రి లో దిగి ప్రవేట్ సంస్థలను ఆశ్రయిస్తే వారే అన్ని చూపిస్తారు.
undefined
వైజాగ్.. వైజాగ్ లో చూడటానికి కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి, బీచ్, అరకులోయ, కైలాసగిరి, సబ్ మెరైన్, ఇందిరగాంధీ జూలాజికల్ పార్క్, అరకులోయ ఇలా చాలా చూడొచ్చు. అరకు అందాలను చూడటానికి ఒక్క రోజు సరిపోదు.
undefined
కర్నూలు.. కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు నగరం నడి బొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు ఒక స్మారక చిహ్నం. ఇది హైదరాబాద్ నగరానికి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.
undefined
click me!