సెక్స్ చేయకపోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

First Published | Dec 11, 2022, 9:53 AM IST

భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇదే వారిద్దరినీ మరింత దగ్గరగా చేస్తుంది. వారి మధ్యన ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు సెక్స్ ఇద్దరిలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీర్ఘకాలం పాటు సెక్స్ లో పాల్గొనకపోయినా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయన్న ముచ్చట మీకు తెలుసా.. 
 

సెక్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. డైలీ లేదా వారానికి రెండు మూడు సార్లు సెక్స్ లో పాల్గొన్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. సెక్స్ వల్ల గుండె ఆరోగ్యంగా,  ఫిట్ గా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. హై బీపీ తగ్గుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎందుకంటే సెక్స్ కూడా ఒక వ్యాయామం లాంటిదే. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సెక్స్ వారి అన్యోన్యతను పెంచుతుంది. ప్రేమను రెట్టింపు చేస్తుంది. ఇవేంటీ సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 
 

కానీ సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న ముచ్చట మాత్రం మందికి తెలియదు. అవును.. సెక్స్ లో సుదీర్ఘకాలం పాల్గొనకున్నా ప్రయోజనాలను పొందుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతమందికి సెక్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంకొంతమందికి ఉండదు. సెక్స్ ను కొందరు బోరీంగ్ గా ఫీలవుతారు. నిజానికి కొన్ని సమస్యలు నుంచి తప్పించుకునేందుకే సెక్స్ కు దూరంగా ఉంటున్నామని అనుకుంటారు. అసలు చాలా కాలం పాటు సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


గర్భం ధరించడం గురించి ఆందోళన ఉండదు

ప్రస్తుత కాలంలో చాలా మంది భార్యభర్తలు పిల్లలను తొందరగా కనడానికి ఇష్టపడటం లేదు. సెక్స్ లో పాల్గొంటే ఖచ్చితంగా గర్భం వస్తుంది. అయినా ప్రస్తుతం ఎంతో ప్రభావవంతమైన జనన నియంత్రణ ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. అయితే గర్భం ధరించకుండా ఉండటానికి 100% ఖచ్చితమైన ఎంపిక మాత్రం శృంగారానికి దూరంగా ఉండటమే. దీనివల్ల గర్భం గురించి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవక్కర్లేదు. 
 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువ

పార్టనర్ తో సెక్స్ లో పాల్గొనడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే సహజంగా  శృంగారానికి దూరంగా ఉండటం వల్ల లైంగికంగా సంక్రమించే సంక్రమణ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది మూత్ర మార్గ సంక్రమణకు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

స్వీయ అవగాహన కలిగి ఉంటారు

ఎవరితోనైనా రతిలో పాల్గొన్నప్పుడు ప్రజలు తమ ఆనందం గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. అయితే హస్త ప్రయోగంతో మీరు ఆనందంగా ఉంటున్నారా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. హస్త ప్రయోగంతో కూడా మీరు లైంగిక ఆనందాన్ని పొందొచ్చు. భాగస్వామితో లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకున్నట్టైతే సెక్స్ మరింత ఆహ్లాదకరంగా ఉండటానికి మీరు దీని గురించి మీ భాగస్వామికి చెప్పొచ్చు.
 

Image: Getty Images

ఒంటరిగా ఎక్కువ సమయాన్ని గడపొచ్చు

శృంగారాన్ని నివారించడం వల్ల ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఏదైనా ముఖ్యమైన భావోద్వేగ సమస్యలపై దృష్టి పెట్టడానికి మీకు తగినంత సమయం ఉంటుంది. అనారోగ్యం లేదా వైద్యం తర్వాత.. సెక్స్ లో పాల్గొనకుండా ఉండాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు.
 

అయితే మీరు లైంగికంగా చురుగ్గా ఉండటానికి ఇష్టపడితే మాత్రం ఎక్కువ సేపు సెక్స్ లేకుండా ఉంటే బాగా నిరాశకు గురవుతారు. అయితే కొద్ది కాలం పాటు సెక్స్ కు దూరంగా ఉంటే మాత్రం వ్యక్తిగత అభివృద్ధికి,  స్వీయ-ప్రేమకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మీరు రిలేషన్ షిప్ లు ఉన్నట్టైతే, సెక్స్ లైఫ్ సరిగ్గా లేదని అనుకున్నట్టైతే మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి. ఏ విషయమైనా చెప్పండి. వారికి అర్థం అయ్యేట్టు చెప్తే..  మీ లైఫ్ సాఫీగా సాగుతుంది. 

click me!