లైంగిక ఆరోగ్యం మీ సాన్నిహిత్యాన్ని, ఆనందాన్ని మెరుగుపరచడమే కాదు మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతుంది. ఎన్నో శారీరక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది సెక్స్. కానీ ప్రస్తుతం చాలా మంది తక్కువై లైంగిక కోరికలతో బాధపడుతున్నారు. అంతేకాదు కొద్దిసేపటికే అలసిపోతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు పురుషుల శక్తిని, లిబిడోను పెంచేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి సంతానోత్పత్తి, లైంగిక బలాన్ని పెంచుతాయి. అవేంటంటే..
Image: Getty Images
దానిమ్మ
రోజూ ఒక దానిమ్మ పండును తినేవారిలో పునరుత్పత్తి ద్రవాల నాణ్యత పెరుగుతుంది. అంతేకాదు ఇది ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది. దానిమ్మలో రక్త ధమనులను సడలించే, గుండె, మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే తేలికపాటి నుంచి మితమైన అంగస్తంభన ఉన్న పురుషులకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ పండ్లలో మహిళల్లో రుతువిరతి లక్షణాలను తగ్గించే సామర్థ్యంతో సహా ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఖర్జూరం
ఖర్జూరాల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ సూపర్ ఫుడ్ పురుషుల సంతానోత్పత్తిని, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. ఇది లిబిడోను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఖర్జూరాలను తింటే మీ లైంగిక స్టామినా పెరుగుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను కూడా పెంచుతుంది. ఖర్జూరాల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఎస్ట్రాడియోల్ స్పెర్మ్ కౌంట్, నాణ్యతపై సానుకూల ప్రభావాలను చూపుతాయి.
బార్లీ
ఇది యోని అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అబ్బాయిలు మంచి అంగస్తంభనను కలిగి ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. బార్లీలో నైట్రిక్ ఆక్సైడ్, అర్జినిన్ లు ఉంటాయి. ఇవి రెండూ పురుషాంగం అంగస్తంభనలో పాల్గొంటాయి. పురుషాంగం పనిచేయకపోవడం చికిత్సకు ఉపయోగించబడతాయి.
garlic
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వెల్లుల్లి సెక్స్ సామర్థ్యాన్ని, కోరికలను పెంచుతుంది. కానీ అనేక మానవ, జంతు అధ్యయనాలు వెల్లుల్లి సంతానోత్పత్తిని పెంచుతుందని, రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా లైంగిక పనితీరును మెరుగుపరుస్తుందని చూపించాయి. అయితే వీటిని ఉపయోగించే ముందు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు చేయండి లేదా చూర్ణం చేయండి. వంట చేయడానికి ముందు కనీసం 10 నిమిషాలు వాటిని అలాగే పెట్టండి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు కారణమయ్యే అల్లిసిన్ అనే సమ్మేళనం వీటిలో పెరుగుతుంది.
Image: Getty Images
గింజలు
పిస్తా, హాజెల్ నట్స్, వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, వేరుశెనగతో సహా గింజలను తినడం వల్ల స్త్రీలలో లైంగిక కోరికలు పెరుగుతాయి. వీటిలో అమైనో ఆమ్లం ఎల్-అర్జినిన్ ఉంది. ఇది జననేంద్రియ అవయవాలకు నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను, రక్త ప్రవాహాన్ని పెంచుతుందని నిరూపించబడింది. ఇది శరీర సహజమైన సెక్స్ కోరికను పెంచుతుంది.