మొటిమలు, మొటిమల వల్ల అయ్యే ఎరుపుదనాన్ని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం..

First Published Oct 6, 2022, 9:52 AM IST

కొందరికి ఏం చేసినా మొటిమలు మాత్రం తగ్గవు. మొటిమలతో పాటుగా ముఖం కూడా ఎర్రగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మొటిమలు, మొటిమల వల్ల అయ్యే ఎరుపుదనం కూడా తగ్గిపోతుంది. 

pimples

ముఖం ఎర్రగా మారడానికి కారణాలెన్నో ఉంటాయి.  అయితే కొందరిలో మొటిమల  వల్ల కూడా ముఖం ఎర్రగా మారుతుంది. అయితే ఈ ఎరుపుదనాన్ని మొటిమలను తొలగించినంత సులువుగా తొలగించలేం. మొటిమల వల్లే చర్మం అలా ఎర్రగా మారుతుంది. అయితే మొటిమలను తగ్గించుకోవడానికి ఉపయోగించే ప్రొడక్ట్స్ వల్ల కూడా చర్మం ఎర్రగా  మారుతుంది. మరి దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం పదండి. 

ఐస్ అప్లై చేయాలి

మొటిమల దగ్గర చర్మం ఎర్రగా మారడమే కాదు వాపు కూడా వస్తుంది. అయితే మొటిమలపై నేరుగా ఐస్ పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక పది నిమిషాల పాటు మొటిమలపై ఐస్ క్యూబ్స్ ను పెట్టడం వల్ల ఎరుపుదనం తో పాటుగా మొటిమలు కూడా తగ్గిపోతాయి. 

Anti Inflammation

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్

యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ను తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. ముఖ్యంగా చర్మం మంట తగ్గుతుంది. ఇలాంటి సమయంలో మీరు షుగర్, ఆల్కహాల్, చాక్లెట్స్, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మంటను ఎక్కువ చేస్తాయి. అల్లం, వెల్లుల్లి, పుచ్చకాయ, దోసకాయ, టమాటాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు. 
 

green tea

ఆరోగ్యకరమైన టీలు

కొన్ని రకాల ఆరోగ్యకరమైన టీలు కూడా మొటిమలను, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. అందులో గ్రీన్ టీ, స్పియర్మెంట్ టీలు మీకు బాగా ఉపయోగపడతాయి. కామెలియా సినెన్సిస్ టీ ఆకులు, మొగ్గలతో టీని తయారుచేస్తారు. ఇక గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను పోగొడుతాయి. వీటిని తాగడం వల్ల మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. 

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్ లోషన్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల నల్లని మచ్చలతో పాటుగా మొటిమల వల్ల అయ్యే ఎర్రని మచ్చలు కూడా తొలగిపోతాయి.  ఎందుకంటే ఈ సన్ స్క్రీన్ రిపేరింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది. ఇది సూర్యుని యువి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమలు, ఎర్రని, నల్లని మచ్చలు పోవాలంటే  సన్ స్క్రీన్ ను తప్పకుండా అప్లై చేయండి. 
 

స్పాట్ ట్రీట్మెంట్ 

స్పాట్ ట్రీట్మెంట్ లు కూడా ముఖంపై ఉండే నల్లని, ఎర్రని లేదా ఊదారంగులో ఉండే మచ్చలను, మొండి మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఈ ఉత్పత్తులు చర్మ రంగును మార్చడానికి ఉపయోగపడతాయి. 
 

click me!