జీర్ణం కావాడం లేదా? మలబద్దకమా.. ఈ టిప్స్ పాటించారంటే.. సమస్యే ఉండదు...

First Published Aug 10, 2021, 1:54 PM IST

డైజేషన్ సరిగా లేకపోతే.. ఏవో బిళ్లలు చప్పరించడమో.. జీలకర్ర, వాము నమలడం లాంటివి చేస్తారు. మోషన్ విషయంలో కూడా అంతే మలబద్ధకానికి మందులు వాడతారు కానీ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే... ఈ రెండు సమస్యల్ని ఈజీగా  అధిగమించొచ్చు అనే విషయం మరిచిపోతారు. 

పొట్టలోనే ఆరోగ్యం ఉందని మన పెద్దలు చెబుతుంటారు. రాళ్లు తిన్నా అరిగించుకునే శక్తి.. మలబద్ధకం లేకుండా ఫ్రీగా అయ్యే మోషన్.. ఇవే మనిషి ఆరోగ్యానికి కొలమానాలు. ఈ రెండింటిలో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుంది.
undefined
ఇప్పటికీ చాలామంది వైద్యులు.. ఏదైనా సమస్యతో వారి దగ్గరికి వెడితే మొదట అడిగే ప్రశ్న మోషన్ ఫ్రీ ఉందా.. అని అడుగుతారు. చాలామంది దీన్ని అంతగా పట్టించుకోరు. డైజేషన్ సరిగా లేకపోతే.. ఏవో బిళ్లలు చప్పరించడమో.. జీలకర్ర, వాము నమలడం లాంటివి చేస్తారు. మోషన్ విషయంలో కూడా అంతే మలబద్ధకానికి మందులు వాడతారు కానీ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే... ఈ రెండు సమస్యల్ని ఈజీగా అధిగమించొచ్చు అనే విషయం మరిచిపోతారు.
undefined
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకమూ ఉండదు. అలాగే ఒకేరకమైన ఆహారం కాకుండా రకరకాల ఫుడ్స్ ను మీ మీల్ లో చేర్చాలి. స్త్రీలు కానీ, పురుషులు కానీ తమ రోజువారీ ఆహారంలో 25నుంచి 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
undefined
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకమూ ఉండదు. అలాగే ఒకేరకమైన ఆహారం కాకుండా రకరకాల ఫుడ్స్ ను మీ మీల్ లో చేర్చాలి. స్త్రీలు కానీ, పురుషులు కానీ తమ రోజువారీ ఆహారంలో 25నుంచి 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
undefined
నీరు ఎక్కువగా తాగాలి.. శరీరాన్ని నిర్జలీకరణ కాకుండా ఉంచడానికే కాదు.. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా నీరు బాగా ఉపయోగపడుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఉండదు. ఎందుకంటే శరీరం డీహైడ్రేట్ అయినప్పడు మలబద్ధకం సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
undefined
ఆహారంలో ప్రొబయాటిక్స్ సప్లిమెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇది మంచి బ్యాక్టీరియాను మీ శరీర వ్యవస్థలోకి ప్రవేశపెట్టి.. సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇవి నాచురల్ ఫుడ్స్ తోనే లభిస్తాయి. కిమ్చి, పెరుగు లాంటివి ప్రొబయాటిక్స్ కు మంచి సోర్స్ లాగా పనిచేస్తాయి.
undefined
ఆహారంతో పాటు వ్యాయమమూ చాలా అవసరం. తిని కూర్చుంటే శరీరం మందగిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం కాకుండా.. శారీరక వ్యాయామం జరిగేలా తిరుగుతుండాలి.
undefined
ఇంకా కొంతమంది ఇలా ప్లేట్లో చేతులు కడిగి.. అలా మంచమెక్కేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. తిన్న తరువాత కాసేపు వాకింగ్ చేయడం చాలామంచిది. లేదా నిలబడి ఉండడమో.. కూర్చోవడమో చేయాలి. అంతేకానీ తిన్నవెంటనే మంచంమీద ఒరగడం, లేదా నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ సరిగా సాగదు.
undefined
కాఫీ, టీలలాంటి వాటికంటే గ్రీన్ టీ తాగండి.. దీనివల్ల పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచిది. కెఫిన్ లేకపోవడం, పాలు కలపకపోవడం వల్ల గ్రీన్ టీ పేగులు, జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
undefined
బాత్రూంకి వెళ్లాల్సి వస్తే ఆపుకోవడం సరికాదు. మూత్రం, మలవిసర్జనను సరైన సమయానికి చేయాలి. అలా కాకుండా ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఇబ్బందే కాకుండా.. పొట్ట ఆరోగ్యమూ పాడవుతుంది. అనవసరంగా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే మహిళలు, బయట తిరిగే పని ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
undefined
నోరు బ్యాక్టీరియాలకు కీలకం. అనేక రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు నోటి ద్వారానే కడుపులోకి చేరతాయి. అందుకే నోటి శుభ్రత చాలా అవసరం. సరిగా బ్రష్ చేసుకోవడం.. రెగ్యులర్ గా డెంటల్ చెకప్స్ చేయించుకోవడం. నోరు దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
undefined
click me!