ఒక దేశాన్ని సూపర్ పవర్‌గా ఎప్పుడు పిలుస్తారు?

Published : Aug 27, 2025, 03:28 PM IST

అగ్రరాజ్యం అంటే అమెరికా అంటారు. అయితే ఇప్పుడు అది క్రమంగా మారుతోంది. ప్రపంచంలో సూపర్ పవర్‌గా మారేందుకు కొన్ని దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు సూప‌ర్ ప‌వ‌ర్ కావాలంటే ఆ దేశానికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
సైనిక బలం

ఒక దేశం ప్రపంచంపై తన ప్రభావం చూపాలంటే బలమైన రక్షణ వ్యవస్థ అవసరం. అణు ఆయుధాలు, ఆధునిక సైనిక సాంకేతికత, విస్తృతమైన సైనిక స్థావరాలు ఉండడం సూపర్ పవర్ లక్షణాలు. అమెరికా, రష్యాలు తమ అణు శక్తి, భారీ సైనిక సామర్థ్యంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

25
ఆర్థిక ఆధిపత్యం

సూపర్ పవర్‌గా ఎదగాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉండాలి. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, కరెన్సీ ప్రభావం, మార్కెట్ ఆధిపత్యం ఒక దేశ ఆర్థిక బలం ఎలాగో చూపిస్తాయి. అమెరికా డాలర్ గ్లోబల్ కరెన్సీగా ఉండటం, చైనా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించడం దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.

35
సాంకేతిక ఆధిక్యం

సైన్స్, టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉండే దేశాలు సూపర్ పవర్ హోదా పొందుతాయి. అంతరిక్ష పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ రక్షణ, అణు సాంకేతికతలో ఆధిపత్యం సూపర్ పవర్ శక్తిని మరింత పెంచుతుంది. అమెరికా NASA, చైనా స్పేస్ ప్రోగ్రామ్ దీనికి మంచి ఉదాహరణలు.

45
సాంస్కృతిక ప్రభావం

సూపర్ పవర్‌గా పిలిచే దేశం ప్రపంచ ప్రజల జీవనశైలిపై ప్రభావం చూపుతుంది. భాష, సినిమా, సంగీతం, మీడియా, ఫ్యాషన్ ద్వారా ఆ దేశ సంస్కృతి ఇతర దేశాల్లోకి విస్తరిస్తుంది. అమెరికా హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ భాష, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాన్ని చూపుతున్నాయి.

55
దౌత్య, అంతర్జాతీయ ప్రభావం

సూపర్ పవర్‌గా గుర్తింపు పొందాలంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం అవసరం. ఐక్యరాజ్యసమితిలో స్థిర సభ్యత్వం, అంతర్జాతీయ ఒప్పందాలపై ప్రభావం వంటి అంశాలు దౌత్య బలాన్ని సూచిస్తాయి. అమెరికా, చైనా ఈ ప్రభావాన్ని బలంగా ఉపయోగించుకుంటున్నాయి. భారత్ కూడా తన పెరుగుతున్న ఆర్థిక, సైనిక, సాంకేతిక శక్తితో భవిష్యత్తులో సూపర్ పవర్‌గా ఎదగడానికి అడుగులు వేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories