ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి !!

First Published Apr 7, 2021, 1:08 PM IST

ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టడం అనే అరుదైన వ్యాధికి గురైన 30 మందిలో  ఏడుగురు మరణించినట్లు యుకె మెడికల్ రెగ్యులేటర్ శనివారం తెలిపింది.

ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టడం అనే అరుదైన వ్యాధికి గురైన 30 మందిలో ఏడుగురు మరణించినట్లు యుకె మెడికల్ రెగ్యులేటర్ శనివారం తెలిపింది.
undefined
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టం లక్షణాలు కనిపిస్తున్నాయని అనేక యూరోపియన్ దేశాలు దీన్ని వాడకానికి విరామం ఇచ్చాయి. దీంతో ఈ మరణాలను ఆస్ట్రాజెనెకా జబ్ వాడకం వల్లే జరిగాయని బ్రిటిష్ గుర్తించింది.
undefined
మార్చి 24 వరకు నమోదైన 30 కేసులలో 7 గురు మరణించడం విచారకరం అంటూయూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) ఒక ప్రకటనలో తెలిపింది.దేశంలో 18.1 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్లు వేసిన తరువాత ప్రభుత్వ వెబ్ సైట్లు ఈ కంప్లైంట్స్ తో నిండిపోయాయి. ఆరోగ్యనిపుణులు, ప్రజలు థ్రోంబోసిస్ రిపోర్టులను అప్ లోడ్ చేశారు.
undefined
ఈ 30 కేసుల్లో ఎక్కువ కేసులు దాదాపు 22 కేసుల్లో సెరిబ్రల్ వెనస్ సైనస్ థ్రోంబోసిస్ అనే అరుదైన రక్తం గడ్డకట్టే వ్యాధి లక్షణాలు కనిపించగా, మిగతా 8 కేసుల్లో ప్లేట్ లెట్ ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల వచ్చే థ్రోంబోసిస్‌ తో బాధపడుతున్నారు.
undefined
అయితే ఫైజర్-బయోఎంటెక్ టీకా వాడడం వల్ల రక్తం గడ్డకట్టినట్లు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఈ థ్రోంబోసిస్‌ నివేదికల మీద తమ సమగ్ర సమీక్ష కొనసాగుతోందని యూకే రెగ్యులేటరీ చెబుతోంది.
undefined
కానీ MHRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జూన్ రైన్ మాట్లాడుతూ కొన్ని ఇబ్బందులున్నప్పటికీ టీకాతో ప్రయోజనమే ఉందని తెలిపారు. మరీ సమస్య తీవ్ర కానంత వరకు ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం కొనసాగించాలని ఆమె తెలిపారు.ఎంహెచ్ఆర్ఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీలు రెండూ కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, రక్తం గడ్డకట్టడం కేసులకు మధ్యనున్న సంబంధం ఏంటీ అనేది ఇంకా స్పష్టం చేయలేదు
undefined
కానీ పెరుగుతున్న ఆందోళనల కారణంగా అనేక దేశాలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేయడమో, విరామం ఇవ్వడమో చేశాయి. రక్తం గడ్డకట్టే కేసులు యువతలోనే ఎక్కువగా కనిపిస్తుండడంతో కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను వృద్ధులకు మాత్రమే పరిమితం చేశాయి.తాజాగా శుక్రవారం నెదర్లాండ్స్ ఆస్ట్రాజెనికా జాబ్ వ్యాక్సిన్ ను 60యేళ్ల లోపు వారికి వేయడాన్ని ఆపేసింది. నెదర్లాండ్స్ లో వ్యాక్సిన్ వేసుకున్న ఐదుగురు యువతులు ఈ వ్యాధి బారిన పడగా అందులో ఒకరు మరణించారు.
undefined
జర్మనీలో ఇలాంటి 31 కేసుల బయటపడ్డ తరువాత 60యేళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయడాన్ని ఆపేసింది. ఈ 31మందిలో వయసులో చాలా చిన్నవాళ్లు, లేదా మధ్యవయస్కులైన మహిళలే ఉండడం గమనార్హం.
undefined
ఫ్రాన్స్‌తో సహా అనేక ఇతర దేశాలు ఇలాంటి వయో పరిమితులను విధించగా, డెన్మార్క్, నార్వేలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేసాయి.
undefined
ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సురక్షితంగా ప్రకటించిన యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA), ఈ సమస్యపై ఏప్రిల్ 7 న కొత్త అప్ డేట్ ను ప్రకటించనుంది.ప్రపంచవ్యాప్తంగా సెరిబ్రల్ సిరల సైనస్ థ్రోంబోసిస్ బారిన పడిన 62 కేసులు నమోదయ్యాయని, వాటిలో 44 యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో యూరోపియన్ యూనియన్, ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్, నార్వేల్లో ఉన్నాయని బుధవారం ప్రకటించారు.
undefined
అయితే, వీటిల్లో జర్మనీలో గుర్తించబడ్డ కేసులను చేర్చలేదు. ఈ ప్రాంతంలో 9.2 మిలియన్లకు పైగా ఆస్ట్రాజెనెకా జబ్‌లు వేశారు. ఇదిలా ఉంటే ఈఎంఏ మాత్రం టీకా సురక్షితమేనని నమ్ముతున్నామని, వయసు, జెండర్, మెడికల్ హిస్టరీ లాంటి వాటివల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు ఇప్పటివరకు కనిపెట్టలేదని వారు తెలిపారు.బ్రిటన్ లోని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో మెడికల్ మైక్రోబయాలజిస్ట్ గా పనిచేస్తున్న పాల్ హంటర్ మాట్లాడుతూ.. ఈ టీకాల వల్ల రక్తం గడ్డకట్టడం అనేది జరగొచ్చని తాను ముందే అనుమానించానని తెలిపారు.
undefined
వివిధ దేశాల్లో పెరుగుతున్న కేసులు దీనిని నిరూపిస్తున్నాయని అన్నారు. లభిస్తున్న సాక్షాధారాలు సమస్యకు కారణం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా అనే చూపిస్తోంది.. అని ఆయన అన్నారు.ఏదేమైనప్పటికీ, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల కోవిడ్ తో మరణించిన వారి సంఖ్యతో పోల్చితే ఈ మరణాలు చాలా తక్కువ అన్నారు. ఆస్ట్రాజెనెకా ప్రతినిధి దీనిమీద స్పందిస్తూ రోగి భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.
undefined
యుకె, ఇయు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ సంస్థలు చివరికి.. అన్ని వయసుల వారూ ఈ సమస్యను అధిగమిస్తారని చెప్పుకొచ్చారు. ఆస్ట్రాజెనెకా గత నెలలో యుఎస్ లో నిర్వహించిన ఎఫిషియెన్సీ ట్రయల్స్ లో తమ వ్యాక్సిన్ వ్యాధిని నివారించడంలో 76 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది. అంతేకాదు EU, UKలు చూపుతున్న డేటా ప్రకారం రక్తం గడ్డకట్టే ప్రమాదం లేదని కూడా తెలిపింది.
undefined
యూకేలో ఇప్పటివరకు 31 మిలియన్లకు పైగా టీకాలు ఇచ్చారు. ఈ టీకాల్లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా,ఫైజర్-బయోఎంటెక్ జబ్స్ ను వాడింది. అయితే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎన్నుకునే ఛాన్స్ ప్రజలకు లేదు.జూన్ 2020 లో యూకే 100 మిలియన్ మోతాదుల ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఆర్దర్ చేసింది.అదే సంవత్సరంలో 30 మిలియన్ మోతాదుల ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్‌ను కూడా ఆర్డర్ చేసింది.
undefined
click me!