న్యూఢిల్లీలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో మహాత్మా గాంధీ పాల్గొనలేదు. ఆ సమయంలో ఆయన కలకత్తా లో ఉన్నారు. ఆగస్టు 15న నేను సంతోషించలేను మిమ్మల్ని మోసం చేయకూడదు అనుకుంటున్నాను కానీ అదే సమయంలో సంతోషించవద్దని నేను మిమ్మల్ని అడగను.
భారతదేశము మరియు పాకిస్తాన్ల మధ్య భవిష్యత్తులో జరిగే వివాదానికి బీజాలు కూడా ఈ రోజే పడ్డాయి అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఆరోజు ఆయన 24 గంటల ఉపవాసం పాటించి, ప్రార్థనలు చేసి ఖాదీ నూలు వడికారు. అలాగే ఆగస్టు 15, 1947న బంకించంద్ర చటర్జీ వందేమాతరం పాడిన తరువాత భారత శాసనమండలి పనిచేయడం ప్రారంభించింది.
ఆ రోజుకి జాతీయ గీతం ఇంకా లేదు. 1950లో జాతీయగీతం ఆమోదించబడింది.స్వతంత్ర దినోత్సవం నాటికి రెండు దేశాల మధ్య సరిహద్దులు ఎలా గీయాలి అనే దానిపై స్పష్టమైన ఆలోచన లేదు. ఆ రోజుకి జమ్మూ కాశ్మీర్లో భారత్ పాకిస్తాన్లు నియంత్రణ రేఖను అనుసరిస్తున్నాయి.
1947న మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం ఇవ్వటానికి ఎందుకు ఎంచుకున్నాడు అంటే అది అతనికి అదృష్ట దినం అని నమ్మాడు అందుకు కారణం అదే రోజున 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయింది.
ఆగ్నేయ ఆసియా కమాండ్ కి సుప్రీమ్ అలైడ్ కమాండర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించాడు అందువల్ల భారత్ కి కూడా అది అదృష్ట దినంగా అతను భావించాడు.
అలాగే మన ప్రస్తుత జాతీయ పతాకం.. మొదటి రూపాంతరాన్ని 1921లో స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించాడు. ఈ జెండా మధ్య గీత పై 24 చుక్కల అశోక చక్రంతో ఆరెంజ్ తెలుపు ఆకుపచ్చ రంగులతో కలిగి ఉంది ఇది జూలై 22, 1947న స్వీకరించి ఆగస్టు 15,1947న ఎగరవేశారు.