ఓలా కు మొట్టికాయలు, లక్ష జరిమానా, హైదరాబాద్ ప్యాసింజర్ కు న్యాయం..

By Mahesh JujjuriFirst Published Apr 22, 2024, 6:26 PM IST
Highlights

ఓలా క్యాబ్ కంపేనీకి నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. మొట్టికాయలు వేయడంతో పాటు.. జరిమానా కూడా విధించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

ప్రముఖ ప్రైవేట్ రవాణా సంస్థ ఓలాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్యాసింజర్ల పట్ల నిర్లక్ష్యం.. తప్పు చేసిన డ్రైవర్ పై చర్యలు తీసకోకపోవడం.. వినియోగదారుని కంప్లైయింట్ పై నిర్లక్ష్యంలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని.. ఓలాపై మండిపడింది డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ III. ఓలా తన డ్రైవర్‌లలో ఒకరి అసభ్య ప్రవర్తను సమర్ధించడంతో పాటు.. అతనిపై చర్యలు తీసుకోనందున ఓలాకు 1 లక్ష జరిమానే వేసింది. 

అసలు విషయం ఏంటీ అంటే.. హైదరాబాద్ కు చెందిన జబేజ్ శ్యామ్యూల్ తన భార్యతో కలిసి ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. పలు ప్రాతాలకు వెళ్ళడం కోసం ఆయన తన భార్య మరియు సహాయకుడితో కలిసి ఉదయం 10 గంటలకు క్యాబ్ ఎక్కాడు. క్యాబ్ మురికిగా  ఉండటం, దుర్వాసన రావడంతో పాటు.. ఎండ వేడి తట్టుకోలేక.. ఎసి  ఆన్ చేయాలని డ్రైవర్ ను రిక్వెస్ట్ చేశాడు. దాంతో డ్రైవర్ వీరి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. ఏసీ వేయడానికి నిరాకరించాడు. 

అంతే కాదు ఆ డ్రైవర ఇష్టం వచ్చినట్టు దూషించడం, అసభ్యంగా మాట్లాడటంతో మధ్యలోనే ప్రయాణికులు క్యాప్ ఆపి దిగిపోయారు. దాంతో మరింత రెచ్చిపోయిన డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. అంతే కాదు 5 కిలోమీటర్లు వచ్చినందకు 800లకు పైగా కట్టమని ఇబ్బందిపెట్టడంతో.. కస్టమర్ వెంటనే ఓలాను సంప్రదించాడు. సదరు డ్రైవరన్ పై ఫిర్యాదు కూడా చేశాడు. కాని ఓలా నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. 

తన సమస్యను పరిష్కరించాల్సిందిగా ఓలాను పదే పదే కోరడం.. ఓలా కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో.. విసిగిపోయిన ప్యాసింజర్ వినియోగదారుల కమీషన్ ను ఆశ్రయించాడు. అయితే ఇదంతా 2021  అక్టోబర్ 19న జరగగా.. తాజాగా ఈ విషయంలో కమీషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. డ్రైవర్ పై చర్యలు తీసుకోకపోవడం.. వినియోగదారిన పిర్యాదుకు స్సందించపోవడంతో.. 1 రూపాయల జరిమానాతో పాటు 860 రూపాయాలకు 12 శాతం వడ్డీతో కలిపి.. 45 రోజుల్లో ప్రయాణికుడికి చెల్లించాల్సింది ఆదేశించింది కమీషన్. 

click me!