డయాబెటిస్ ఉన్నవారికి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు సర్వసాధారణం. యోగాసనాలు శరీరంలోని కీళ్లను సడలిస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి.
యోగాలో ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఉంటాయి, ఇవి ఒత్తిడి, ఆందదోళనను తగ్గించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం.
కొన్ని యోగాసనాలు క్లోమం, కాలేయం, మూత్రపిండాలు వంటి అంతర్గత అవయవాలను ప్రేరేపిస్తాయి. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ధ్యానం ఆధారిత యోగా వ్యాయామాలు నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహాయపడతాయి. డయాబెటిస్‌తో సంబంధం ఉన్న నాడి నష్టాన్ని (డయాబెటిక్ న్యూరోపతి) నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
యోగా వ్యాయామం శరీరంలో జరిగే మార్పులను గ్రహించడంలో, ఆకలి, ఒత్తిడి సంకేతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడానికి మరియు ఒత్తిడిని బాగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
కొన్ని యోగాసనాలు శరీర సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వృద్ధ డయాబెటిస్ రోగులలో పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యోగాలోని శ్వాస వ్యాయామాలు (ప్రాణాయామం) మనస్సును శాంతపరచడానికి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది.