Health tips: రోజూ ఈ ఒక్కటి తింటే చాలు.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది!

Published : May 15, 2025, 01:55 PM IST

ప్రస్తుతం షుగర్ వ్యాధి సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కానీ ప్రతిరోజూ ఈ ఒక్కటి తింటే షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి అదెంటో.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
Health tips: రోజూ ఈ ఒక్కటి తింటే చాలు.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది!

డయాబెటిస్‌ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే డయాబెటిస్ నియంత్రణలో ఉండదు. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో సహాయపడే ఓ పదార్థం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

27
షుగర్ నియంత్రణకు ఉల్లిపాయ!

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి డయాబెటిస్ ఉన్నవారికి ఆకుకూరలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే, డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయ తింటే మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

37
రక్తంలో చక్కెరను తగ్గించే ఉల్లి..

నిపుణుల ప్రకారం పచ్చి ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ఉల్లిపాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయట. చాలా కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఉల్లిపాయలను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

47
ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ

ఆరోగ్య నిపుణుల ప్రకారం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు తీసుకోకూడదు. కానీ ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పచ్చి ఉల్లి, ఎర్ర ఉల్లిపాయలు మంచివి.

57
చక్కెర స్థాయిలు స్థిరంగా..

ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ, వాటి ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలతో పాటు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచవచ్చు.

67
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది!

ఉల్లిపాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇది శరీరం కార్బోహైడ్రేట్లు, కొవ్వులను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా.. ఉల్లిపాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

77
యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఉల్లిపాయ..

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. డయాబెటిస్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ షుగర్ వ్యాధి ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories