బ్రష్ చేసుకోగానే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

Published : Sep 07, 2025, 01:25 PM IST

ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది పళ్లు తోముకున్న తర్వాత నీళ్లను తాగుతుంటారు. కానీ ఇలా తాగడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

PREV
15
ఆరోగ్యం

రోజుకు రెండు పూటల బ్రష్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు పళ్లను తోముకోవడం వల్ల మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాం. నోటి ఆరోగ్యం మనం మొత్తం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

25
ఆరోగ్య చిట్కాలు

నిపఅయితే చాలా మంది బ్రష్ చేసుకున్న వెంటనే నీళ్లను తాగేస్తుంటారు. కానీ బ్రష్ చేసిన వెంటనే నీళ్లను తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టూత్ పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ పళ్ళపై పేరుకుపోయి బ్యాక్టీరియాతో పోరాడి మన దంతాలను రక్షిస్తుంది. దీంతో మన పళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. 

35
పళ్లు తోముకున్న తర్వాత ఎంతసేపటికి నీళ్లు తాగాలి?

నిపుణుల ప్రకారం.. ఈ ఫ్లోరైడ్ దంతాలపై తన ప్రభావాన్ని చూపించడానికి సుమారుగా 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అప్పుడే ఇది ఎనామిల్ ను, దంతాలను బలపరుస్తుంది. కాబట్టి పళ్లు తోముకున్న వెంటనే నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

45
రోజుకు ఎన్ని సార్లు బ్రష్ చేయాలి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మన పళ్లు తోముకునే టూత్ పేస్ట్ లోని ఫ్లోరైడ్ దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి దంతాలు బలంగా ఉండటానికి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

55
బ్రష్ చేశాక వేటిని తాగకూడదు?

బ్రష్ చేసుకున్న వెంటనే ఒక్క నీళ్లను మాత్రమే కాదు టీ, కాఫీ వంటి పానీయాలను కూడా తాగకూడదు. ఈ అలవాట్లను పాటిస్తే మీ దంతాలు బలంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. పళ్లు తోముకున్న 15 నిమిషాల తర్వాత ఏదైనా తాగొచ్చు. గనుక ఇకనుంచి మీరు బ్రష్ చేసుకున్న వెంటనే నీళ్లను తాగడం మానేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories