ఒత్తిడి తగ్గాలంటే తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసా?

Published : Sep 05, 2025, 04:19 PM IST

మనలో చాలామంది రకరకాల కారణాలతో ఒత్తిడికి గురవుతుంటారు. దానివల్ల నిద్రలేమి, అలసట, తలనొప్పి వంటి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ఒత్తిడిని దూరం చేయడమే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
17
ఒత్తిడిని తగ్గించే ఫుడ్స్..

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. పని ఒత్తిడి కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు కావచ్చు. కానీ ఒత్తిడి పెరిగితే మెదడు పనితీరు, నిద్ర, ఆరోగ్యం అన్నీ ప్రభావితమవుతాయి. ఇలాంటి పరిస్థితిలో సహజంగా ఒత్తిడి తగ్గడానికి మనం తీసుకునే ఆహారమే చక్కని పరిష్కారం. ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

27
అవకాడో

అవకాడో.. ఒత్తిడి తగ్గించడానికి చక్కగా సహాయపడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. హ్యాపీ హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాదు అవకాడో గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

37
బ్రోకలీ

బ్రోకలీలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. ఇవి కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మెదడుకు సంతోషాన్ని ఇచ్చే హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తాయి.

47
పెరుగు

పెరుగు పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. పెరుగులో కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఒత్తిడి నిర్వహణకు పరోక్షంగా సహాయపడతాయి.

57
డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ మితంగా తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే కోకో ప్లేవనాయిడ్లు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

67
నట్స్

నట్స్‌లో మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి.

ప్రోటీన్ ఫుడ్స్

ప్రోటీన్ శరీరానికి, జీర్ణవ్యవస్థకు చాలా అవసరం. మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

77
సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ లో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. చేపల్లోని ప్రోటీన్, ఇతర పోషకాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories