Health tips: రెండు రోజులు ఆహారం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

Published : May 14, 2025, 01:32 PM IST

ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం చాలా ముఖ్యం. అందుకే మనం ప్రతిరోజూ మూడు పూటల ఆహారం తీసుకుంటాం. ఇంకా చిరుతిళ్లు కూడా తింటూ ఉంటాం. కానీ 2 రోజులు ఏం తినకుండా.. కేవలం నీరు మాత్రమే తాగి ఉంటే ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
14
Health tips: రెండు రోజులు ఆహారం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ సరిగ్గా భోజనం చేయాలి. భోజనం కడుపు నింపడమే కాదు.. రోజువారీ పనులకు శక్తినిస్తుంది. మన ఎదుగుదలకు సహాయపడుతుంది. కొందరు వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంటారు. మరి రెండు రోజులు ఆహారం మానేసి.. కేవలం నీరు తాగి ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

24
2 రోజులు ఫుడ్ తినకపోతే ఏమవుతుంది?

నిపుణుల ప్రకారం.. మనం ఆహారం తినడం మానేసిన 10 గంటల తర్వాత శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల వ్యక్తులు సన్నబడతారు. ఆహారం తీసుకోని 16 గంటల తర్వాత మన శరీరంలోని క్యాన్సర్ కణాలు చనిపోవడం ప్రారంభమవుతాయి. అంటే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

34
ఆహారం మానేసిన తర్వాత..

ఆహారం మానేసిన 24 గంటల తర్వాత మీ పేగులు శుభ్రపడతాయి. పేగులు శుభ్రంగా ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. దీనివల్ల గ్యాస్ట్రిక్, ఆసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఆహారం తీసుకోకుండా పానీయాలు తాగుతూ ఉంటే.. 36 గంటల తర్వాత మీరు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. మెదడు కూడా మెరుగ్గా పనిచేస్తుంది.

44
రోగనిరోధక శక్తి పెరుగుతుంది!

ఆహారం మానేసిన 48 గంటల తర్వాత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు ఏదైనా వ్యాధి రాకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోగలుగుతారు. 

ఇది గుర్తుంచుకోండి!

ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటుంది. ఇలాంటి ఫాస్టింగ్ అందరికీ సెట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు రెండు రోజులు ఆహారం మానేసి కేవలం పానీయాలే తీసుకోవాలనుకుంటే, ముందుగా మీ ఆరోగ్య నిపుణుల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!