పసుపు టీ:
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి కలిపి ఉదయం పరగడుపున తాగాలి. పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. పసుపు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.