శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి, ప్రశాంతత కూడా అంతే అవసరం. ప్రతిరోజూ 7-8 గంటలు గాఢ నిద్ర అవసరం. తక్కువ సేపు నిద్రపోయినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు వ్యాయామం చేయడానికి, పోషకమైన ఆహారం తినడానికి కూడా ఆసక్తి ఉండదు.
ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి: ఒత్తిడి శరీర బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం. యోగా, ధ్యానం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, స్నేహితులతో మాట్లాడటం వంటి మీకు నచ్చిన పనులు చేసి ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.