Sugar Challenge: 90 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా ?

Published : Jun 27, 2025, 12:22 PM IST

Quit Sugar Challenge: నిత్య జీవితంలో చ‌క్కెర‌ ఓ భాగం. ఉద‌యం నిద్రలేసింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏదొక రూపంలో చక్కెరను తీసుకుంటాం. అలాంటి చక్కెరను దూరం పెడితే అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. వరుసగా 3 నెలల పాటు చక్కెర మానేస్తే ఊహించని ప్రయోజనాలు పొందవచ్చు

PREV
15
నిత్య జీవితంలో భాగం

చ‌క్కెర‌.. నిత్యవసరం , ఉద‌యం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదొక రకంగా చక్కెర తీసుకుంటాం. అయితే.. చ‌క్కెర‌ను అతిగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  అలాంటి చక్కెరను  తినడం మానేస్తే  అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. దాదాపు 3 నెలల పాటు చ‌క్కెర లేని డైట్‌ను పాటిస్తే..  అప్పుడు చ‌క్కెర అంటేనే వ‌ద్దు అనే భావ‌న‌కు వ‌స్తుంది. అయితే.. చక్కెర తిన‌డం మానేస్తే మ‌న శరీరంలో జ‌రిగే మార్పులేంటో తెలుసుకుందాం. 

25
డయాబెటిస్ కు చెక్

 చక్కెరలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.  వీటి వల్ల బరువు పెంచుతాయి. చక్కెర మానేస్తే క్రమంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా కడుపు చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. చక్కెర తినకపోతే శరీరంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్‌కి శరీరం బాగా స్పందిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది.

35
గుండె జబ్బులకు చెక్

షుగర్ లెవల్స్  ఎక్కవ ఉన్న ఆహారం తినడం వల్ల  గుండె సమస్యలు దారితీస్తుంది. చక్కెర తగ్గిస్తే బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. చక్కెర లేని ఆహారాలు పేగుల్లో మంచి బాక్టీరియాకి మేలు చేస్తాయి. చక్కెర తినకపోతే మొటిమలు, ముడతలు రావు. చక్కెర తగ్గిస్తే చర్మం, ముఖం కాంతివంతంగా, యవ్వనంగా మారుతాయి..

45
మానసిక ఆరోగ్యం

రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనాశక్తి పెరుగుతాయి. మూడ్స్వింగ్స్, డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి.  తీపి తినాలనిపిస్తే.. పండ్లు వంటి సహజ తీపి పదార్థాలు తినండి.  

55
ఇతర ప్రయోజనాలు

చక్కెర  వినియోగం తగ్గిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 90 రోజులు చక్కెర మానేస్తే టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొవ్వు కాలేయం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. చక్కెర మానేయడం కష్టమే అయినా.. శరీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories