Hair Growth Tips: తలకు ఉల్లిపాయ రసం ఇలా రాస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుందట!

Published : Jun 27, 2025, 12:43 PM IST

Hair Growth Tips:  ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు.  చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమస్యకు ఉల్లిపాయ రసం ఎలాంటి పరిష్కరం చూపుతుందో తెలుసుకుందాం.

PREV
14
జట్టు సమస్యలకు పరిష్కారం

నేటీ జీవనశైలి, మారుతున్నఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంటే జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు పొడిబారడం వంటి అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు సమస్యలను నివారించడానికి చాలా రెమిడీస్ వాడుతుంటారు.  ఇందులో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఉల్లిపాయ రసం బెస్ట్ ఛాయిస్ .

24
జుట్టుకు ఉల్లిపాయ రసం

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా..  ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మనలో చాలా మందికి జుట్టుకు ఉల్లిపాయ రసం ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ కథనం ద్వారా తలకు ఉల్లిపాయ రసం ఎలా ఆప్లై చేయాలో తెలుసుకుందాం. 

34
పులియబెట్టిన తర్వాతే

సాధారణంగా చాలా మంది ఉల్లిపాయ నుండి రసం తీసిన వెంటనే తలకు రాస్తారు. కానీ అలా చేయడం తప్పు అని నిపుణులు చెబుతున్నారు. అంటే ఉల్లిపాయ రసాన్ని దాదాపు 72 గంటలు పులియబెట్టిన తర్వాతే రాసుకోవాలి.  అప్పుడు మాత్రమే ఉల్లిపాయ రసం మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఒత్తైన, పొడవైన జుట్టు కావాలని కోరుకునే వారు ఉల్లిపాయ రసం వాడండి. 

44
ఎలా ఉపయోగించాలి?

జుట్టుకు ఉల్లిపాయ రసం రాసే ముందు, జుట్టును కాస్తా తడిపి ఉంచుకోండి. ఇప్పుడు పులిసిన ఉల్లిపాయ రసాన్ని తలకు రాసి దాదాపు 5 నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో బాగా కడగాలి వారానికి కనీసం రెండుసార్లు ఇలా ట్రై చేసి చూడండి. మంచి ఫలితాలు వస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories