Walking During Periods: పీరియడ్స్ టైంలో వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

Published : May 16, 2025, 12:54 PM IST

వాకింగ్ ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలుసు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలుంటాయి. కానీ ఆడవాళ్లు పీరియడ్స్ టైంలో వాకింగ్ చేయడం మంచిదేనా? పీరియడ్స్ టైంలో వాకింగ్ చేస్తే ఏమవుతుంది? ఇతర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Walking During Periods: పీరియడ్స్ టైంలో వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రతిరోజూ కఠినమైన వ్యాయామాలు చేయడం కంటే ప్రతిరోజూ ఒక గంట వాకింగ్ చేస్తే చాలని.. దానివల్ల శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. కానీ పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయచ్చా.. లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆ సందేహాన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

25
వాకింగ్ ప్రయోజనాలు

ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దాంతో వారు చాలా ఇబ్బంది పడతుంటారు. మరికొంత మందికి ఆ నొప్పిని భరించే శక్తి ఉంటుంది. కాబట్టి, ప్రతిరోజూ వాకింగ్ చేసే స్త్రీలు పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయచ్చా? దాని లాభాలు, నష్టాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

35
పీరియడ్స్ టైంలో వాకింగ్ ప్రయోజనాలు

రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది:

 

నెలసరి సమయంలో వాకింగ్ చేసినప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల ఈ సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కాకుండా కడుపు ఉబ్బరం వంటి అనేక శారీరక సమస్యలను పరిష్కరించడంలో వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది:

పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడితో ఉంటే నెలసరి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

45
మానసిక స్థితి మెరుగుపడుతుంది

సాధారణంగా వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తే మానసిక స్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నెలసరి సమయంలో వాకింగ్ చేస్తే హార్మోన్ల మార్పుల వల్ల కలిగే చిరాకును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

55
నెలసరి టైంలో వాకింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు:

రక్తస్రావం పెరుగుతుంది:

 

కొంతమంది స్త్రీలకు ఏదైనా శారీరక శ్రమ చేస్తే వారికి రక్తస్రావం, కడుపు నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయకపోవడమే మంచిది.

కండరాల అలసట

చాలా తీవ్రమైన లేదా ఎక్కువ సేపు వాకింగ్ చేస్తే త్వరగా కండరాలు అలసిపోతాయి. దీనివల్ల కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories