Varicose Veins Home Remedies: ఈ మధ్య కాలంలో చాలా మందికి కాళ్ళ సిరల్లో వాపు (వెరికోస్ వెయిన్స్) సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను ఈ క్రింది వంటింటి చిట్కాలతో తగ్గించుకోవచ్చంట.
కాళ్ళ సిరల్లో వాపు (వెరికోస్ వెయిన్స్) ఇది అసాధారణ సమస్య. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. కాళ్ళలో నరాలు, రక్తనాళాలు వంకరలు తిరిగితే గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కాళ్ళ నొప్పి, బరువుగా అనిపించడం, వాపు, చర్మం రంగు మారడం, నరాలు నీలి లేదా ఎర్రగా కనిపిస్తాయి. ఈ వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ముందుగానే గుర్తించి, దీనిని నివారించే చిట్కాల గురించి తెలుసుకుందాం.
26
చేయాల్సినవి
వెరికోస్ వెయిన్స్ నివారణకు వ్యాయామం చాలా ముఖ్యం. అంటే మరి ఎక్కువ వ్యాయామం అవసరం లేదు. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోకూడదు. నడక, సైక్లింగ్, జాగింగ్ లాంటివి చేయొచ్చు. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సాల్మన్ చేప, ఆలివ్ నూనె, వాల్ నట్స్, కానన్ గౌతి చేపలు, కీర, బాదం, పుచ్చకాయ గింజలను తమ డైట్ లో చేర్చుకోవాలి.
36
చేయకూడని పనులు
వెరికోస్ వెయిన్స్ సమస్య పరిష్కారానికి ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం ఎక్కువ ఆహారం, ప్యాకెట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండండి. ఇవి వెరికోస్ వెయిన్స్ సమస్యను తీవ్రం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. టైట్ సాక్స్ లు, దుస్తులు వేసుకోకూడదు. అసౌకర్యంగా ఉంటే కలబంద గుజ్జుతో మసాజ్ చేయండి. కలబంద వాపు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారు మునగ, పసుపు ఉపశమానాన్ని ఇస్తాయి. మునగాకు, పసుపును కలిపి నూరి, అందులో రెండు చెంచాల ఆముదం కలిపి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట ఆప్లై చేయండి. ఆరిన తర్వాత వేడి నీళ్ళతో కడగాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, వాపు తగ్గిస్తుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే వెరికోస్ వెయిన్స్ సమస్య తగ్గుతుంది.
56
నువ్వుల నూనెతో ఇలా ..
వెరికోస్ వెయిన్స్ సమస్యకు నువ్వుల నూనె కూడా ఓ మంచి పరిష్కారం. 100 ml నువ్వుల నూనె, 4 చెంచాల జీలకర్ర, 2 చెంచాల పసుపు కలిపి ఓ గిన్నెలో వేసి వేడి చేయాలి. పసుపు రంగు మారి, మిశ్రమం గట్టి పడే వరకు వేయించండి. చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో నిల్వ చేసుకోండి. అవసరమైనప్పుడు ఈ నూనెను వెరికోస్ వెయిన్స్ ఉన్న చోట పై నుంచి కిందకి రాసుకోవాలి. ఇలా చేస్తే నరాలు సాధారణ స్థితికి వస్తాయి.
66
వైద్య సలహా
వెరికోస్ వెయిన్స్ కు నువ్వుల నూనె, జీలకర్ర మంచి పరిష్కారం పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధి తీవ్రత తగ్గిస్తాయి. అయితే.. ఇది వంటింటి చిట్కా మాత్రమే. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిల్చోవడం, ఊబకాయం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. ఈ చిట్కాలు పూర్తి పరిష్కారం కాదు. కాళ్ళ నొప్పి, వాపు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది.