Curry Leaves For Hair : ప్రతి ఒక్కరికి తమ జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల ఖరీదైన నూనెలు, షాంపూలను ఉపయోగిస్తారు. ఇకపై వాటన్నింటికీ స్వస్తి చెప్పి.. పెరటిలో పెరిగే కరివేపాకుని వాడితే చాలు. ఎలాగంటే?
జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది: కరివేపాకులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు జుట్టు వేర్లను బలపరుస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గి, కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
జుట్టు దట్టంగా పెరగడానికి : కరివేపాకు వాడటం వల్ల జుట్టు పలుచబడకుండా ఉంటుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని అరికట్టి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
26
చుండ్రును తొలగిస్తుంది
కరివేపాకులో బాక్టీరియా, ఫంగస్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది చుండ్రు, దురదను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను అరికట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
36
కరివేపాకు నూనె
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి తయారు చేసిన నూనెని తలకు రాసుకుని మసాజ్ చేసుకుంటే జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు రాసుకుని, గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. మంచి ఫలితాలు వస్తాయి.