Health Care: భరించలేని మోకాళ్ల నొప్పులు.. ఆ నూనెను ఇలా వాడితే క్షణాల్లో రిలీఫ్ !

Published : Jun 28, 2025, 05:40 PM IST

Coconut Oil : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అవన్నీ తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం కోసం.. కొబ్బరి నూనెతో ఇవి కలిపి వాడండి. 

PREV
14
మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం

ఒకప్పుడు వయసు మీద పడితే.. మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ, ఇప్పుడు 40 ఏళ్లకే చాలా మందికి మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. గుజ్జు అరిగిపోవడం, నడుస్తుంటే కలుక్కుమని చప్పుడు రావడం లాంటివి సాధారణమైపోయాయి. ఈ సమస్య వచ్చిందంటే.. ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పని చేయలేము, ఎక్కువసేపు నడవలేము. ఈ సమస్య  నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అవన్నీ తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నూనెను మరికొన్ని పదార్థాలతో కలిపి మోకాళ్లకు రాస్తే.. నొప్పులు తగ్గుతాయి. ఇంతకీ ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం.  

24
కొబ్బరి నూనె, అశ్వగంధ పొడి :

అశ్వగంధ తైలము: కొబ్బరి నూనెలో అశ్వగంధ పొడిని కలిపి మోకాళ్ళకు రాసుకున్నట్లయితే. మోకాళ్ల నొప్పులు తగ్గిపోయే అవకాశం ఉంది.

 యూకలిప్టస్ ఆయిల్:

కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను కలిపి మోకాళ్లకు రాసి, మసాజ్ చేస్తే మోకాళ్ల నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే యూకలిప్టస్ నూనెలో అలెర్జీ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది.

34
కొబ్బరి నూనె, కుంకుమపువ్వు :

 కొబ్బరి నూనెలో కుంకుమపువ్వు పొడి కలిపి మోకాళ్ళకు రాసుకుంటే నొప్పి తగ్గుతుందని, రక్తప్రసరణ మెరుగుపడుతుందని కొందరు నమ్ముతారు. కుంకుమపువ్వు, కొబ్బరి నూనె రెండు కూడా చర్మానికి మంచివని, నొప్పిని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

కొబ్బరి నూనె, మెంతులు :

కొబ్బరి నూనెలో మెంతులు కలిపి రాసుకుంటే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. మెంతులు, కొబ్బరి నూనెలో ఉండే లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

44
కొబ్బరి నూనె, నువ్వుల నూనె :

కొబ్బరి నూనె, నువ్వుల నూనె : కొబ్బరి నూనె, నువ్వుల నూనె రెండూ మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి మోకాళ్లకు రాసి మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది.

కొబ్బరి నూనె, ధనియాలు :

 కొబ్బరి నూనెలో ధనియాలు వేసి మరిగించాలి. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పి తగ్గుతుంది. ఇది ఒక సహజ నివారిణీగా పనిచేస్తుంది.  

కొబ్బరి నూనె, కర్పూరం :

కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరం కలిపి మోకాళ్ళకు రాసి, మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories