
ఇటీవల హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులో మాట్లాడిన ఉపాసన.. మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటే అండాలను ఫ్రీజ్ చేయించుకోవడం మంచి ఉపాయం అని తెలిపారు. ఇది “మహిళలకు అతిపెద్ద బీమ”లాంటిందని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది.
ఉపాసన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొందరు ఉపాసనకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మరిన్ని విజయాలు సాధించడానికి ఎగ్ ఫ్రీజింగ్ అనేది మంచి ఆప్షన్ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది డబ్బులు ఎక్కువ ఉన్నవారికి మాత్రమే సెట్ అవుతుందని సామాన్యులకు ఇది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు.
తన పోస్టు పై వచ్చిన విమర్శలపై ఉపాసన స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆరోగ్యకరమైన చర్చ సాగడం ఆనందంగా ఉందన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు, ప్రేమగా పెళ్లి చేసుకోవడం, సమయం నిర్ణయించడం వంటి విషయాలు గౌరవంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాను 27 ఏళ్లలో పెళ్లి చేసుకున్నానని, 29 ఏళ్ల వయసులో తమ అండాలను ఫ్రీజ్ చేయించుకిన.. 36లో బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. అలాగే ఇప్పుడు కవలలకు జన్మించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై ఉపాసన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అండాలను సేకరించి, క్రయోగెనిక్ టెక్నిక్స్ ఉపయోగించి చాలా తక్కువ తాపన వద్ద నిల్వ చేయడమే ఎగ్ ఫ్రీజింగ్ విధానం. భవిష్యత్తులో నచ్చినప్పుడు ఫ్రీజ్ చేసిన అండాలను శుక్రకణాలతో ఫలదీకరించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ ప్రయత్నాలకు ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైన ప్రీ-పెరెస్టీవ్ రిప్రొడక్టివ్ సైవింగ్ టెక్నిక్స్.
* ముందుగా థైరాయిడ్, షుగర్, ప్రొలాక్టిన్ స్థాయిలు వంటి పరీక్షలను నిర్వహిస్తారు.
* అనంతరం అండాశయ నిల్వ (Ovarian Reserve) కొలిచేందుకు AMH టెస్ట్ చేస్తారు.
* మెన్స్ట్రువల్ సైకిల్‌కి సంబంధించి 2వ లేదా 3వ రోజున అల్ట్రాసౌండ్ ద్వారా ఫాలికల్ కౌంట్ చెక్ చేస్తారు.
* దశలవారీగా హార్మోన్ ప్రేరణ ఇంజెక్షన్లను ఇస్తారు.
* అనస్థీషియా ఇచ్చి అండాలను బయటకు తీసి సేకరిస్తారు.
* ఆ తర్వాత సేకరించిన అండాలను క్రయోప్రొటెక్షెంట్ మధ్యలో ఫ్రీజ్ చేస్తారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఛార్జీలను వసూలు చేస్తారు.
అయితే ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత అండం కచ్చితంగా ఫలదీకరణ చెందుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. సాధారణంగా తక్కువ వయసులో విజయ రేట్లు అధికమయినప్పటికీ వయసు పెరిగినా కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. 35 ఏళ్లకు ముందు ఫ్రీజ్ చేస్తే లైవ్ బర్త్ రేట్లు సాధారణంగా మెరుగ్గా కనిపిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని లెక్కల ప్రకారం.. 35కి ముందున్న వారిలో 60 శాతం విజయవంతం కాగా.. 40 ఏళ్లకిపైబడిన వారిలో 20–30% స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.
క్లినిక్, మందుల బ్రాండ్, అవసరమైన సైకిల్స్ సంఖ్యపై ఆధారపడి ఖర్చు పరిమితి ఉంది. సాధారణంగా ప్రాసెస్ ఖర్చు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు అవుతుంది. అదనంగా వార్షిక నిల్వ ఛార్జీలు సుమారు రూ. 10,000 నుంచి మొదలవుతాయి. మొత్తం వ్యయం, అవసరమైన మందులు, తీసుకొనే సైకిల్స్ పరిమాణం ఆధారంగా పెరగొచ్చు.
ఫ్రీజ్ చేసిన అండాలు భవిష్యత్తులో 100 శాతం గర్భధారణ అవుతాయని హామీ ఇవ్వలేమని వైద్యులు అంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్‌తో గ్యారంటీ లేకపోవడం ప్రధాన ఆందోళన. అదనంగా, ఐవీఎఫ్ సైకిళ్ల విఫలతలు, రిపీట్ ఇంజెక్షన్లు, అనేక వైద్య ప్రక్రియల వల్ల భావోద్వేగ నొప్పి, ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
* వైద్యపరమైన కారణాల ద్వారా సంతానోత్పత్తి ప్రమాదంలో ఉన్నవారు (క్యాన్సర్ చికిత్స మొదలైనవి).
* కుటుంబ చరిత్రలో ప్రీమేచర్ మెనోపాజ్ ఉన్నవారు.
* వృత్తిపరిశ్రమా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లలు కావాలని యోచించేవారు, ఆర్థికంగా ప్లాన్ చేసి, పూర్తి సమాచారం తీసుకున్నవారికి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది.
హార్మోన్ల ఇంజెక్షన్ల సమయంలో భావోద్వేగాల్లో మార్పులు, కడుపులో ఉబ్బరం, అసౌకర్యం కలగొచ్చు. ఎమోషనల్ సపోర్ట్, భాగస్వామి సపోర్ట్, కౌన్సెలింగ్ వంటి అవసరాలు ఉంటాయి. అలాగే ఆర్థిక ప్రణాళిక లేకపోతే దీని ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్‌కు వెళ్లే ముందు ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.