పెద్ది సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన చికిరి చికిరి స్టెప్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. కానీ ఈ స్టెప్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం మీకు తెలుసా? నిజమే.. ఈ స్టెప్ చేయడం గుండెకు మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. దీర్ఘకాల ఆరోగ్యం కోసం గుండెకు సంబంధించిన వ్యాయామాలు చేయడం అవసరం. ఆధునిక జీవన శైలి, కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలామంది గుండె జబ్బులు, రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక సింపుల్ స్టెప్ తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. పెద్ది సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన “చికిరి చికిరి స్టెప్” చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
చికిరి చికిరి స్టెప్
చికిరి చికిరి స్టెప్ చాలా క్రియేటివ్ గా, సింపుల్ గా ఉంటుంది. ఈ స్టెప్ లో చిన్నగా లెగ్స్ కదలిస్తూ, హ్యాండ్స్ మెల్లగా మూవ్ చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆక్సిజన్ సరఫరా సమానంగా జరిగి హార్ట్ రేట్ స్థిరంగా పెరుగుతుందని చెబుతున్నారు. గుండెకు అవసరమైన వ్యాయామం జరగడం వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
34
మొత్తం ఆరోగ్యానికి కూడా..
చికిరి చికిరి స్టెప్ చేయడం వల్ల గుండెకు మాత్రమే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. కేలరీలు బర్న్ కావడం, జీవక్రియ పెరగడం, శక్తి స్థాయి పెరగడం లాంటి లాభాలు ఉన్నాయి. రోజువారీ స్థిరమైన ప్రాక్టీస్ వల్ల, స్ట్రోక్, హై బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఈ స్టెప్ వల్ల లెగ్స్, హ్యాండ్స్, కోర్ మజిల్స్, శారీరక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల ప్రకారం.. శారీరక వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగాలు చేసే వాళ్లు, లేదా వాకింగ్ చేయడానికి వీలు కానీ వాళ్లు కూర్చున్న చోటనే ఇలా చికిరి చికిరి స్టెప్ చేయడం వల్ల.. వాకింగ్ చేస్తే వచ్చే ఫలితాలు దాదాపుగా వస్తాయి. చికిరి చికిరి స్టెప్ వంటి సింపుల్, ఫన్ స్టెప్ లు లేదా ఎక్సర్‌సైజ్ చాలా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాదు శరీరం కదలడం వల్ల ఎండోర్ఫిన్లు విడుదలై మానసిక ప్రశాంత లభిస్తుంది. ఒకవేళ చికిరి చికిరి స్టెప్ రాకపోతే.. కుర్చీలో కూర్చొని పాదాలను వేళ్లపై ఉంచి తిరిగి యథాస్థానానికి తీసుకురావాలి. అలాగే మోకాలు నుంచి కాలును పైకి లేపి యాంకిల్ ని పైకి, కిందకి కదపాలి. ఇలా పది, పది సెట్లు వీలున్నప్పుడు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.