Cancer: శరీరంపై సడెన్ గా ఏదైనా కణతి లేదా గడ్డ లాంటివి కనిపిస్తే వాటిని తేలికగా తీసుకోకూడదు. నొప్పి లేదు కదా పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అని చాలా మంది పట్టించుకోరు. కానీ, నొప్పి లేని వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. లోపల ఏదైనా సమస్య మొదలైతే, అది చిన్న చిన్న లక్షణాల ద్వారా ముందుగానే మననల్ని హెచ్చరిస్తుంది. కానీ మనం ఎక్కువగా వాటిని సాధారణ సమస్యలా తీసుకొని నిర్లక్ష్యం చేస్తాం. కాని కొన్ని లక్షణాలు క్యాన్సర్ కి ప్రారంభ లక్షణాలు కావచ్చు. ఎలాంటి లక్షణాల ద్వారా క్యాన్సర్ ని గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...
25
మలవిసర్జనలో మార్పులు...
మల విసర్జనలో మార్పులు దీర్ఘకాలం కొనసాగితే జాగ్రత్తపడాలి. ముఖ్యంగా 3 నుంచి 4 వారాలు మలబద్దకంతో ఇబ్బంది పడటం లేదా మలం లేదా మూత్రంలో రక్తం పడటం లాంటి లక్షణాలు కనిపిస్తే.. పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వీటిని యూరినరీ ఇన్ఫెక్షన్ అనుకుని వదిలేయకూడదు. ఇవి కూడా క్యాన్సర్ కి ప్రారంభ సంకేతాలు కావచ్చు. కాబట్టి... ఇలాంటి సంకేతాలు కనపడితే... వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
35
శరీరంలో ఏదైనా కొత్త కణతి, లేదా గడ్డ ఏర్పడటం....
శరీరంపై సడెన్ గా ఏదైనా కణతి లేదా గడ్డ లాంటివి కనిపిస్తే వాటిని తేలికగా తీసుకోకూడదు. నొప్పి లేదు కదా పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అని చాలా మంది పట్టించుకోరు. కానీ, నొప్పి లేని వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మీ మెడ, చేతులు, బుగ్గలు, చాతి, పొత్తికడుపు ఇలా శరీరంలో ఏ భాగంపైన గడ్డ వచ్చినా.. అది పెరుగుతున్నట్లు మీకు అనిపించినా, కొన్ని వారాలు గడిచినా కూడా అది తగ్గడం లేదు అంటే.. దానిని అలా వదిలేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
3.శరీరంపై ఏదైనా మానని పుండు...
మీ శరీరంపై ఎక్కడైనా మానని పండు లేదా గాయం ఏర్పడినా దానిని కూడా తేలికగా తీసుకోకూడదు. ముందులు వేసుకున్నా అది తగ్గకుండా ఇబ్బంది పెడుతుందంటే అది స్కిన్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. చిన్న అనుమానం ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
మన శరీరంపై పుట్టు మచ్చలు ఉండటం చాలా సహజం. చాలా మంది వాటిని అసలు పట్టించుకోరు. కానీ.. మీ ఒంటిపై పుట్టుమచ్చలు సడెన్ గా పెద్దదిగా మారుతున్నట్లు మీరు గమనించినా, లేదా అది రంగు మారినా, దాని మీద దురద రావడం, రక్తం రావడం లాంటివి వస్తున్నాయి అంటే వాటిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే చర్మ సంబంధిత నిపుణులకు చూపించుకోవాలి.
ఆహారం మింగడం కష్టంగా అనిపించడం....
చాలా మందికి ఆహారం మింగడం కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇలాంటి సమస్యను కూడా చాలా తేలికగా తీసుకోకూడదు. కొంచెం ఆహారం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం, ఛాతి మంట గొంతు నొప్పి రావడం లాంటివి కడుపు క్యాన్సర్ కి ప్రారంభ సంకేతాలు కావచ్చు. కాబట్టి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
55
అసాధారణ రక్తస్రావం / డిశ్చార్జ్
మహిళలు ప్రత్యేకంగా గమనించాల్సిన సంకేతాలు ఇవి. పీరియడ్స్ కాకపోయినా అధిక రక్త స్రావం జరగినా, అనుకోకుండా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం ఇలా ఎలాంటి మార్పులు గమనించినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
సడెన్ గా బరువు తగ్గడం, తగ్గని దగ్గు....
ఏ కారణం లేకుండానే సడెన్ గా బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం లాంటి సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మందులు వాడుతున్నా కూడా నెలలు గడుస్తున్నా దగ్గు తగ్గకపోవడం లాంటి లక్షణాలను కూడా తేలికగా తీసుకోకూడదు.
గమనిక...
ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడే క్యాన్సర్ ఉందని కాదు. కానీ ఇవన్నీ కలిసి నిరంతరం కొనసాగితే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ప్రారంభ దశలో గుర్తిస్తే.. తగిన చికిత్స తీసుకునే వీలు ఉంటుంది. పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.