థైరాయిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసా?

First Published Oct 22, 2021, 9:33 PM IST

ప్రస్తుత కాలంలో ప్రజలను రకరకాల వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా థైరాయిడ్ (Thyroid) సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య మహిళల్లో (Women) ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రస్తుత కాలంలో ప్రజలను రకరకాల వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా థైరాయిడ్ (Thyroid) సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య మహిళల్లో (Women) ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఈ వ్యాధిని అంచనా వేయవచ్చు.
 

థైరాయిడ్ గ్రంథి (Thyroid gland) శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను (Hormones) ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ, తక్కువ అయిన ఆరోగ్యంపై ప్రభావితం పడుతుంది. ఇది శరీరంలోని కణాలపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  
 

థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్యలు 2 రకాలు. ఒకటి హైపో థైరాయిడిజం (Hypothyroidism), రెండవది హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism). అయితే మనం ఎక్కువగా గమనించేది హైపో థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంను తక్కువగా గమనిస్తూ ఉంటాం. థైరాయిడ్ సమస్య వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి.
 

థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే శరీర బరువు (Body weight) పెరుగుతుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్లు పెరిగితే శరీర బరువు తగ్గుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దీని లక్షణాలు మెడ ఉబ్బడం (Swelling of the neck) లాంటింది. దీనికి కారణం థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పులే.
 

హైపోథైరాయిడ్ శరీరంలోని ప్రతి కణానికి పై ప్రభావితం చూపుతుంది. తీవ్రమైన అలసట (Severe fatigue), బరువు తగ్గడం, జుట్టు రాలడం, అధిక చెమటలు, బలహీనంగా అనిపించడం, అధిక విరేచనాలు (Excessive diarrhea), కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల కావొచ్చు.
 

తొందరగా అలసట రావటం, నిరసించి పోవటం, లైంగిక పరంగా సమస్యలు (Sex problems) వస్తుంటాయి. చర్మం పొడిగా ఉండటం, మలబద్దకం, కాళ్లు వాపు రావటం, బరువు పెరగడం, తగ్గటం నెలసరులు క్రమంగ రాకపోవటం, పిల్లలో ఎదుగుదల, మానసిక ఎదుగుదల (Mental growth) లేకపోవటం థైరాయిడ్ ముఖ్య లక్షణాలు.
 

మహిళల్లో  థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా (Period's) సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి థైరాయిడ్ (Thyroid) సమస్యలకు తగిన చికిత్స చేయించుకున్నట్లైతే ఈ సమస్యలనుండి దూరంగా ఉండవచ్చు.

click me!