Strong Food : చికెన్, మటన్, ఎగ్ కంటే ఐదురెట్లు ఎక్కువ శక్తి .. యూత్ కోసం మంతెన సూచించే స్ట్రాంగ్ ఫుడ్స్

Published : Jan 24, 2026, 09:30 AM IST

Menthena Tips :  నేటి యువత కెఎఫ్సి చికెన్, బిర్యానీలు, నాన్ వెజ్ బర్గర్లకు బాగా అలవాటుపడ్డారు. ఇవే బలాన్నిచ్చే అహార పదార్థాలని నమ్ముతున్నారు. కానీ వీటికంటే ఐదారు రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే శాఖాహార పదార్థాలు ఉన్నాయని మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.  

PREV
15
Strong Food

Strong Food : యుక్త వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది... అందుకు తగ్గట్లుగానే పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి లక్ష్యసాధన దిశగా సాగాలంటే మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా బలంగా ఉండాలి. అందుకే యువతీయువకులు బలవర్ధక అహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం... లేదంటే శరీరం బలహానపడి ఆలోచనల్లో కూడా వాడివేడి తగ్గుతుంది.

అయితే బలమైన ఫుడ్ అనగానే ముందుగా వినిపించేది మాంసాహారమే. చికెన్, మటన్, ఫిష్ తో పాటు కోడిగుడ్లతో అధిక కేలరీలు లభిస్తాయని... ఇవే అత్యంత శక్తినిచ్చే పదార్ధాలుగా అనాధిగా చెబుతూ వస్తున్నారు. కానీ వీటిలో కంటే అధిక శక్తి కొన్నిరకాల గింజల్లో ఉంటుందని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చెబుతున్నారు. ఏ గింజల్లో ఎన్ని కేలరీల శక్తి ఉంటుందో ఆయన వివరించారు.

25
మాంసాహారంలో ఉండే కెలరీలెన్ని..?

గుడ్డు, చికెన్, మటన్ తినేవారు బలంగా ఉంటారనేది అపోహ మాత్రమే... వీటిలో చాలా తక్కువ కెలరీలుంటాయి. మంతెన సత్యనారాయణ రాజు ప్రకారం ఏ మాంసాహారంలో ఎంత శక్తి ఉంటుందంటే..

ఒక్క కోడిగుడ్డు ద్వారా 72 కేలరీల శక్తి వస్తుంది.

100 గ్రాముల చికెన్ ద్వారా 109 కెలరీలు

100 గ్రాముల మటన్ ద్వారా 118 కెలరీల శక్తి వస్తుంది. 

ఇక ఇతర మాంసాహారాల్లో కూడా కాస్త అటుఇటుగా ఇంతే కేలరీలు ఉంటాయి. వీటికంటే అధిక శక్తి కొన్నిరకాల గింజల ద్వారా మన శరీరానికి లభిస్తుందని మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.

35
ఏ పదార్థాలు, గింజల్లో ఎన్ని కేలరీలుంటాయి..?

100 గ్రాముల పచ్చి కొబ్బరిలో 444 కెలరీలు

100 గ్రాముల వేరుశనగలో 567 కేలరీలు

100 గ్రాముల జీడిపప్పులో 596 కేలరీల

100 గ్రాముల పుచ్చకాయ గింజల్లో 628 కేలరీలు

100 గ్రాముల పిస్తాలో 626 కేలరీలు

100 గ్రాముల వాల్ నట్స్ లో 687 కేలరీలు

మెకడమియా, పైనట్స్ లో 680-700 కేలరీల శక్తి

ఉంటుందని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. కాబట్టి ఈతరం యూత్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటి ఎండు గింజలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కుదిరితే వీటిన నానబెట్టుకుని లేదంటే దోరగా వేయించి తినాలని ఆయన సూచించారు. ఎలాతిన్నా గింజలు శక్తినివ్వడమే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మంతెన తెలిపారు. 

45
ఈ డ్రై ప్రూట్స్ లో కూడా అధిక శక్తి

కర్జూరా, అంజీరా, కిస్మిస్ వంటి డ్రైప్రూట్స్ లో కూడా అధిక శక్తి ఉంటుందని సత్యనారాయణ రాజు తెలిపారు. ఇలా ఎండు గింజలు, డ్రైప్రూట్స్ లో చికెన్, మటన్ కంటే ఐదురెట్లు ఎక్కువ బలం ఉంటుందని... ఇవే అత్యంత బలాన్నిచ్చే పదార్థాలని ఆయన స్పష్టం చేశారు. వీటిని తినడంద్వారా యువతకే కాదు ప్రతి ఒక్కరికీ బలం లభిస్తుందని తెలిపారు. 

55
ఊపులో ఉండే యువతకు ఇదే బలం..

వయసులో ఉండే యువతకు మాంసాహారం కంటే శాఖాహారమే ఉత్తమమని... ఇందులోనే అధిక కేలరీల శక్తి ఉంటుందని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. కేవలం మాటలతో కాదు ఎందులో ఎన్ని కేలరీల శక్తి ఉందో కూడా వివరించారు. కాబట్టి యువత ఏదైనా సాధించాలంటే ముందుగా అహార అలవాట్లను అలవర్చుకోవాలని... దీనివల్ల వారికి శారీరక బలం లభిస్తుందని తెలిపారు. 

వయసులో ఉండే యువతకు ఊపు ఎక్కువగా ఉంటుంది.... కాబట్టి వీరికి మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. శరీరం స్ట్రాంగ్ గా ఉంటేనే ఆలోచనల్లో పదును పెరుగుతుంది... లక్ష్యసాధన ఈజీ అవుతుంది. కాబట్టి రోజూ మాంసాహారం తినడం కంటే అధిక శక్తిని ఇచ్చే గింజలు తినడం ఉత్తమం. దీనివల్ల ఖర్చు తగ్గి డబ్బులు కూడా ఆదా అవుతాయి... బలం కూడా లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories