Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?

Published : Dec 06, 2025, 11:27 AM IST

Sneeze Reflex: తుమ్ము అనేది శ‌రీరంలో జ‌రిగే అత్యంత‌ స‌హ‌జ ప్ర‌క్రియ‌. సాధార‌ణంగా తుమ్ము వ‌స్తే అదేదో అనారోగ్యంగా భావిస్తాం. కానీ తుమ్ము ఒక వేగమైన రక్షణ వ్యవస్థ. ఇంత‌కీ అస‌లు తుమ్ము ఎందుకు వస్తుంది, దాని వెనుక ఉన్న శాస్త్రీయ ప్రక్రియ ఏమిటో చూద్దాం. 

PREV
15
అలెర్జీలు తుమ్ముకు ప్రధాన కారణం

పోలెన్, డస్ట్, పెంపుడు జంతువుల రోమాలు, ఫంగస్ వంటి కనబడని చిన్న కణాలు ముక్కులోకి వెళ్లినప్పుడు శరీరం వాటిని ప్రమాదంగా భావిస్తుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ “హిస్టమైన్‌” అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. దీని వల్ల ముక్కు లోపలి భాగంలో స్వల్ప వాపు, రాపిడి ఏర్పడి తుమ్ము వస్తుంది.

25
జలుబు, ఫ్లూ సమయంలో ఎందుకు ఎక్కువ

జలుబు వైరస్‌లు ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ఇన్‌ఫెక్ట్ చేసి వాపు కలిగిస్తాయి. వైరస్ పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలో ఇర్రిటేషన్ పెరుగుతుంది. అందుకే జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు వరుసగా అనేక తుమ్ములు వస్తాయి.

35
పొగ, రసాయనాలు, వాసనలు కూడా

పొగ, కాలుష్యం, ప‌ర్ఫ్యూమ్స్‌, క్లీనింగ్ కెమికల్స్, మిరప దుమ్ము వంటి పదార్థాలు ముక్కులోని సున్నితమైన న‌రాల‌ను ఉద్దీపితం చేస్తాయి. ఈ న‌రాలు వెంటనే మెదడుకు “ఇర్రిటెంట్ ఉంది, బయటికి పంపాలి” అనే సంకేతం ఇస్తాయి. దాంతో శరీరం వేగంగా తుమ్మును ఉత్పత్తి చేసి ఆ కణాలను బయటికి తోసేస్తుంది.

45
సూర్యకాంతిలో ఉన్నా..

కొంతమందికి సూర్యకాంతి లేదా హఠాత్తుగా వచ్చే కాంతి తగిలినా తుమ్ము వస్తుంది. దీనిని “ఫోటిక్ స్నీజ్ రిఫ్లెక్స్” అంటారు. ఇది కంటి న‌రాలు, ముక్కు న‌రాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండటం వల్ల జరుగుతుంది. 18–35% మందిలో ఈ రిఫ్లెక్స్ కనిపిస్తుంది.

55
చల్లని వాతావరణం లేదా భోజనం తర్వాత

చల్లని గాలి పీల్చినప్పుడు ముక్కులోని న‌రాలు తక్షణమే స్పందిస్తాయి. ఇది ఒక రక్షణ చర్యగా తుమ్మును కలిగిస్తుంది. కొంతమంది భోజనం చేసిన తర్వాత కూడా తుమ్ముతారు. దీనిని “స్నేటియేషన్” (Snatiation) అంటారు. పొట్ట విస్తరించేటప్పుడు అది తుమ్మును నియంత్రించే నర్వ్ పాథ్‌లను ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories